Also Read: విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త.. అక్టోబర్ 5నే ఆ పథకం అమలు..?
ఇంత వరకు బాగానే ఉన్నా.. చంద్రబాబు ఇలా కీలకమైన బాధ్యతలను అచ్చెన్నాయుడికి అప్పగించినా కానీ, ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితిని చక్కబెట్టడం ఎవరికైనా సాధ్యపడుతుందా..? ఇప్పటికే ఖాళీ అవుతున్న పచ్చ పార్టీని బలోపేతం చేయడం అంత ఈజీ అవుతుందా..? అనేది ప్రశ్న. దీనికితోడు.. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తెచ్చేస్థాయికి చేర్చినా నెక్ట్స్ సీఎం ఎవరు..? ఎవరి కష్టం.. ఎవరి ఖాతాలోకి వెళ్తుంది ? పోనీ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ మరోసారి ఓటమిపాలైతే.. ఆ అపవాదు.. ఎవరికి చెందుతుంది ? ఇప్పుడు ఈ ప్రశ్నలే టీడీపీలో తెరమీదికి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు తర్వాత పార్టీలో చినబాబు లోకేష్ హవా నడుస్తోంది. బాబు, చినబాబును కాదని అచ్చెన్నాయుడికి పార్టీలో ఏమేరకు ప్రాధాన్యం తగ్గుతుంది.
వీటన్నింటికీతోడు పార్టీలో ఇప్పటిఏ అసంతృప్తులు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో నాయకులను బుజ్జగించడం అంతా ఈజీ కాదు. వీటిని ఛేదించాలంటే వ్యూహాలు కావాలి. సీనియర్ లీడర్ కాబట్టి అచ్చెన్నకు అలాంటి వ్యూహం అనుకుందాం కానీ.. అసలే కుల రాజకీయాలు ఎక్కువ అనే అపవాదు ఉన్న ఏపీలో ఇప్పుడు అందరూ సహకరించగలుగుతారా అనేది టాక్. రాష్ట్ర పగ్గాలు చేపడుతున్న అచ్చెన్నాయుడు ముందు.. అనేక చిక్కులే ఉన్నాయి.
Also Read: గంటకు రూ.90కోట్లు.. దేశంలోనే కుబేరుడిగా అంబానీ
బీసీ వర్గాలను చేరదీయడం.. యువతను తన వైపు తిప్పుకోవడం.. పార్టీలో అసంతృప్తులను తగ్గించడం.. కేవలం ఓ వర్గానికే పరిమితమైందన్న పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేయడం, అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తన వ్యూహానికి తగిన విధంగా టికెట్లను పంపిణీ చేయడం.. ఇవన్నీ చేస్తేనే అప్పుడు అచ్చెన్నాయుడు సక్సెస్ అవుతారు. కానీ, ఇవన్నీ సాధ్యపడేనా? చిన్నబాబు లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్న టీడీపీ రాజకీయాలు.. అచ్చెన్నకు సానుకూలం అవడం ఖాయమేనా ? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.