
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. రాష్ట్రంలో 61.65మంది వృద్ధాప్య పింఛన్లకు అర్హులు కాగా వారి కోసం 1,497 కోట్ల నిధులను విడుదల చేసింది. వీరిలో కొత్తగా 34,907 మంది పింఛన్ తీసుకోనున్నారు. వీరి కోసం 8.52 కోట్లు కేటాయించింది. ఈ మేరకు గురువారం నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.