https://oktelugu.com/

TDP : మొదటి బాణం సంధించిన టీడీపీ..

TDP announces first candidate in upcoming assembly elections : తెలుగు దేశం పార్టీ ఎన్నికలకు రెండేళ్ల ముందే సమరశంఖం పూరించింది. ఏకంగా పోరాట యోధురాలితో ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగింది. ఈసారి టికెట్లు పోరాటం చేసే వారికేనని స్పష్టం చేసింది. తద్వారా టీడీపీ గెలుపునకు బాటలు వేసుకుంది. టీడీపీ నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి అభ్యర్థిని ప్రకటించి టీడీపీ సంచలనం సృష్టించింది. ఒక దళిత పోరాట యోధురాలికి టికెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.. తెలుగుదేశం పార్టీని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2022 / 04:29 PM IST
    Follow us on

    TDP announces first candidate in upcoming assembly elections : తెలుగు దేశం పార్టీ ఎన్నికలకు రెండేళ్ల ముందే సమరశంఖం పూరించింది. ఏకంగా పోరాట యోధురాలితో ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగింది. ఈసారి టికెట్లు పోరాటం చేసే వారికేనని స్పష్టం చేసింది. తద్వారా టీడీపీ గెలుపునకు బాటలు వేసుకుంది. టీడీపీ నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి అభ్యర్థిని ప్రకటించి టీడీపీ సంచలనం సృష్టించింది. ఒక దళిత పోరాట యోధురాలికి టికెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది..

    Chandra Babu Naidu

    తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు ఎంతో కృషి చేస్తూ వస్తున్న వారికి కానుకగా తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. తెలుగు దేశం పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు, యువతకు పెద్ద పీట వేస్తూ మొదటి నిర్ణయం తీసుకోవడం విశేషం.

    ఎంతో కష్టపడుతూ అందరికీ స్ఫూర్తిని పంచుతున్న తెలుగుదేశం తరుపున పోరాటతత్వాన్ని కనపర్చిన కర్లంపూడి వెంకాయమ్మను గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచన మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

    ఒక దళిత పోరాట యోధురాలికి తొలి టికెట్ ఇచ్చి సామాజిక కోణంలోనూ టీడీపీ న్యాయం చేసినట్టైంది. జగన్ ను ఎదుర్కోవాలంటే బలమైన క్యాండిడేట్లు అవసరం.. ప్రజల్లో పోరాటం చేసిన వారు ఇంకా అవసరం. అందుకే జగన్ సర్కార్ పై అమరావతి విషయంలో పోరాడిన వెంకాయమ్మకు తొలి టికెట్ ఇచ్చి టికెట్ల విషయంలో.. టీడీపీ గెలుపు విషయంలో సరైన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నట్టైంది. ప్రజల్లో పోరాటం చేసేవారికి టికెట్లు దక్కుతాయని ఈ నిర్ణయంతో చంద్రబాబు క్యాడర్ కు స్పష్టం చేశారు.

    దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు టీడీపీలో చర్చ సాగుతోంది. ఇక నుంచి ప్రజల్లో మంచి పేరు ఉంటేనే టికెట్లు దక్కుతాయని.. పార్టీ కోసం కష్టపడిన వారికే ఈసారి టికెట్లు ఇవ్వబోతున్నారని సంకేతాలు పంపినట్టైంది.

    Tags