Homeఎంటర్టైన్మెంట్Chief Minister Tears After Watching The Movie: సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి......

Chief Minister Tears After Watching The Movie: సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి… కారణం తెలిస్తే గుండె బరువెక్కుతుంది!

Chief Minister Tears After Watching The Movie: కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు. ఇంట్లో ప్రేమగా పెంచుకునే పెట్ డాగ్స్ కుటుంబంలో సభ్యుల మాదిరి కలిసిపోతాయి. ఒక్కరోజు ఆ పెట్ డాగ్ కనిపించకుంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లల వలె చుట్టూ తిరుగుతూ ప్రేమ కురిపించే పెట్ డాగ్స్ యజమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటాయి. ఏళ్ల తరబడి మనతో పాటు జీవించిన పెట్ డాగ్ మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. లేటెస్ట్ రిలీజ్ 777 చార్లీ మూవీ చూసిన సీఎం కన్నీటి పర్యంతం కావడం హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ చిత్రం చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు ఆపుకోలేకపోయారు. ఆ సినిమా చూసి బసవరాజు బొమ్మై గతంలో మరణించిన తన పెట్ డాగ్ ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం బసవరాజు ఇంట్లో చాలా కాలంగా ఓ పెట్ డాగ్ ఉండేది. దానితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో ఆ డాగ్ చనిపోవడంతో సీఎం బసవరాజు చాలా కృంగిపోయారట. 777 చార్లీ సినిమా చూశాక తనకు దూరమైన పెట్ డాగ్ ని తలచుకొని ఆయన ఏడ్చారు.

Chief Minister Tears After Watching The Movie
Basavaraj Breaks Down After Watching 777 Charlie

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా 777 చార్లీ తెరకెక్కింది. చార్లీ అనే డాగ్ ఓ మనిషి జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఆ సినిమా కథ. జూన్ 10న కన్నడ, తెలుగు భాషల్లో 777 చార్లీ విడుదల చేశారు. దర్శకుడు కిరణ్ రాజ్ కే తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. కన్నడలో 777 చార్లీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. ఈ ప్రయోగాత్మక చిత్రం ముఖ్యంగా పెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.

Chief Minister Tears After Watching The Movie
777 Charlie

ఇక మూగజీవాలను అమితంగా ప్రేమించే యాంకర్ రష్మీ… 777 చార్లీ మూవీ అందరూ చూడాలంటూ పిలుపునిచ్చారు. మూగజీవాల ప్రాముఖ్యత, వాటి ప్రేమను తెలియజేసే ఈ మూవీని అందరూ ఆదరించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. రష్మీ చాలా కాలంగా మూగజీవాల సంక్షేమం కోసం పోరాడుతున్నారు. వాటిని హింసించకుండా ప్రేమించాలంటూ అవగాహన కల్పిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version