Sai Pallavi Wedding: మన సౌత్ ఇండియా లో అధిక శాతం మంది హీరోయిన్స్ కి నటన కంటే అందాలు ఆరబొయ్యడమే ఎక్కువ వచ్చు..అందం తో పాటు అద్భుతమైన అభినయం చూపించే హీరోయిన్స్ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు..ఆ తక్కువమంది లో ఒక్కరే మన సాయి పల్లవి..అప్పట్లో ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ అనే డాన్స్ షో ద్వారా పరిచయం అయిన ఈ అమ్మాయి తన డాన్స్ టాలెంట్ తోనే సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది..అలా మలయాళం లో ప్రేమమ్ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన సాయి పల్లవి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది..ఈ సినిమా తర్వాత ఆమెకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు..ఇక ఆ సినిమా తర్వాత తెలుగు లో ఈమె వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఫిదా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో సాయి పల్లవి నటన మరియు అద్భుతమైన డాన్స్ ప్రేక్షకులను థియేటర్స్ కి వెళ్లి మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది..అలా తెలుగు మరియు తమిళ బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సాయి పల్లవి ఇప్పుడు విరాట పర్వం సినిమా ద్వారా ఈ నెల 17 వ తారీఖున మన ముందుకి రాబోతుంది.

విడుదలకి కేవలం మూడు రోజుల సమయమే ఉండడం తో ఈ చిత్ర ప్రొమోషన్స్ తెగ బిజీ గా గడుపుతుంది సాయి పల్లవి..అయితే ఆమె ఇచ్చిన ఇంటర్వూస్ లో తన పెళ్లి గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆమె మాట్లాడుతూ ‘లాక్ డౌన్ సమయం లో ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అమ్మ నాన్న చాలా ఫోర్స్ చేసారు..వాళ్ళు అనుకున్నట్టు అన్ని జరిగి ఉంటె ఈపాటికి నాకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు’అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి..ఇది ఇలా ఉండగా ఈమె ప్రస్తుతం ఒక యంగ్ హీరో తో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియా లో ఒక్క వార్త గత కొంతకాలం నుండి జోరుగా ప్రచారం సాగుతుంది..చాలా కాలం నుండి వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అని..ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా ఉండడం తో పెళ్లి కి కాస్త సమయం కావలి అని అడిగినట్టు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి..ఇంతకీ ఎవరు ఆ హీరో అనేది తెలియాల్సి ఉంది..సోషల్ మీడియా లో వస్తున్నా ఈ వార్తల పై సాయి పల్లవి ఇప్పటి వరుకు ఎలాంటి స్పందన చెయ్యలేదు..దీనిని బట్టి చూస్తుంటే సోషల్ మీడియా లో వచ్చినవి రూమర్స్ కావు అని..అవి నిజమేనని నెటిజెన్లు నమ్ముతున్నారు.


