Chandrababu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు గంభీరంగా కనిపిస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే తీరుగా వ్యవహరిస్తారు. కానీ ఎప్పుడు కూడా కంటతడి పెట్టి ఎరగరు. అలాంటిది అసెంబ్లీలోనే ఆయన కన్నీరుమున్నీరుగా విలపించడం సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ నేతల నిర్వాకంతోనే బాబు కన్నీరు కార్చారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లు ఓపికగా ఉండాలని నిలదీస్తున్నారు. తగిన గుణపాఠం చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో వైసీపీ నేతల మాటలతోనే చంద్రబాబు తీవ్రంగా మనోవేదనక గురయ్యారని రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. వైసీపీ విధానాలు ఎండగడుతూ తెలుగు తమ్ముళ్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల ఇళ్ల వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. నేతల తీరుతోనే బాబు విచారం చెంది కన్నీరు పెట్టుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే చంద్రబాబు వైఖరిలో ఎందుకు మార్పు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరాభవంపై ఆయన ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ నేతల్లో కూడా ఉన్న అసమ్మతిని పోగొట్టేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అసలు ఆయన ఏ ఉద్దేశంతో కన్నీరు పెట్టుకున్నారనే దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత కనిపించడం లేదని తెలుస్తోంది.
రాష్ర్టంలో అధికారం సాధించాలంటే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అపర చాణక్యుడిగా పేరున్న బాబు కొద్ది రోజులుగా అపజయాలే మూటగట్టుకుని పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. పార్టీలో సీనియర్లు సూచించే మార్గాలను సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తన్నాయి. అందుకే విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతోనే ఆయన అన్ని సమస్యలకు ఒకే సమాధానం తీరుగా కన్నీరు కార్చారనే విషయం మాత్రం పలువురికి అర్థమైనట్లు సమాచారం.
Also Read: Chandrababu Crying: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?
తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీపై ప్రతీకారం తీర్చుకునేంుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఆందోళనలకు దిగినట్లు సమాచారం. దీంతో రాష్ర్టంలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఏర్పటనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీని నిలువరించే క్రమంలోనే ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Repeal of Agricultural Laws: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?