Pawan Kalyan- Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జన సేనాని పవన్ కళ్యాణ పట్టు బిగిస్తున్నారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పావులు కదుపుతున్న పవన్.. బలమైన అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో ఓడించడంపై ప్రస్తుతం ప్రధాన దృష్టి పెట్టారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ క్రమంలో.. అధికార వైసీపీలోని బలమైన అభ్యర్థులను గుర్తిస్తున్నారు. వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొడాలి నానిని టార్గెట్ చేసిన పవన్.. ఆయనపై పోటీచేసే అభ్యర్థిని దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. తాజాగా నగరి ఎమ్మెల్యే, సిని నటి ఆర్కే.రోజాను టార్గెట్ చేశారు. ఆమెను ఓడించే బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కసరత్తు మొదలు పెట్టారు.

వైసీపీ ఫ్రైర్ బ్రాండ్..
వైసీపీకి కొడాలి నాని ఎంత బలమో మహిళా నేతగా రోజా కూడా అంతే బలం. ఆ పార్టీలో రోజా అంత బలంగా ప్రతిపక్షాన్ని ఎండగట్టే సత్తా రోజాకు ఉన్నట్లుగా ఏ మహిళా నేతకు లేదనే చెప్పాలి. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా.. పవన్ కళ్యాణ్ అయినా, సోము వీర్రాజు అయినా సరే.. జగన్ జోలికి వస్తే రోజా రెస్పాన్స్ వేరేలా ఉంటుంది. తనదైన రీతిలో విమర్శలతో ప్రతిదాడి చేస్తుంది. గతంలో చేసిన ఆ పార్టీ వైఫల్యాలను ఎండగడుతుంది. జగన్‌ను ఓడించేందుకు పవన్, బాబు పన్నుతున్న కుట్రను బయటపెడుతుంది. కేవలం అధికారం కోసమే విపక్షాలు పాకులాడుతున్నాయని ఎదురుదాడి చేస్తుంది. ఒకరకంగ ఆచెప్పాలంటే రోజా వైసీపీకి దొరికిన ఒక ఫైర్ బ్రాండ్.. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడలోనూ రోజా సక్సెస్ అవుతారు. ఇదే ఇప్పుడు రోజాను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని విపక్ష టీడీపీ, జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి.
టీడీపీ అభ్యర్థి రెడీ..
నగరిలో రోజాను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. రోజాను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో బాబు పనిచేస్తున్నారు. వాస్తవానికి రోజా.. టీడీపీ మొక్కే.. చంద్రబాబు సమక్షంలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకుంది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరింది. తర్వాత జగన్‌వెంట నడిచి వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. రోజా ప్రస్తుతం ఏపీలో మంత్రి. ప్రభుత్వంపై విమర్శలు చేసేవారి భరతం పట్టడంలో ఆమెకు ఆమె సాటి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమెను ఓడించడం ద్వారా వైసీపీ ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాశ్‌ను సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే భానుప్రకాశ్ రోజాను ఓడించేంత పనిచేశారు. రోజా కేవలం 2708 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. ప్రస్తుతం రోజాపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. సొంత పార్టీలోనూ వ్యతిరేక వర్గం పనిచేస్తుంది. ఈ క్రమంలో రోజాను ఓడించే లక్ష్యంతో బాబు పావులు కదుపుతున్నారు.
పవన్ టార్గెట్ కూడా ఆమె..
జన సేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆర్కే. రోజాను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని ఫిక్స్ అయ్యారట. రోజాకు పార్టీ ఎంత సపోర్టో.. పార్టీకి కూడా రోజా అంత బలమని జనసేనాని గుర్తించారు. ఆమెను ఓడించడం ద్వారా వైసీపీని బలహీనపర్చవచ్చని పవ¯Œ భావిస్తున్నారు. అయితే నగరిలో రోజాకు కూడా మంచి పట్టు ఉంది. అయితే సొంత పార్టీలో రోజాకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారు. వీరికి గాలం వేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రోజాను దెబ్బతీయవచ్చని జనసేన నేతలు భావిస్తున్నారు.

అసమ్మతితో ఫైర్‌బ్రాండ్‌కు కష్టాలు..
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు నగరి నియోజకవర్గంలో అసమ్మతి కష్టాలు తప్పడం లేదు. వ్యతిరేకవర్గం తీరుపై రోజా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా సద్దుమణగడం లేదు. మరోవైపు గ్రూపు తగాదాలతో రోజా జనంలోకి Ðð ళ్లడం లేదు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో రోజా వెనుకబడిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జగన్ నిర్వహించిన సమావేశంలోనూ రోజాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని జనసేన చూస్తోంది.
పొత్తు నేపథ్యంలో..
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఇప్పటికే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆరోపణలకు బలం చేకూరుస్తు జగన్, చంద్రబాబు సంయుక్తంగానే రోజాను టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తు కుదిరితే గాలి భాను ప్రకాశ్‌నాయుడికే మద్దతు ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నారు. అలా కుదరని పక్షంలో వైసీపీ తరఫున బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో రోజాను కొట్టేదెవరో చూడాలి మరి.