Homeజాతీయ వార్తలుTaraka Ratna Wife : తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి పొలిటికల్ ఎంట్రీ.. అక్కడ నుంచే పోటీ

Taraka Ratna Wife : తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి పొలిటికల్ ఎంట్రీ.. అక్కడ నుంచే పోటీ

Taraka Ratna Wife : నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? తన భర్త చివరి కోరికను నెరవేర్చడానికి సిద్ధమవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంనాడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఆయన మరణంతో వ్యక్తిగత జీవితం బయటపడింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అలేఖ్యారెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారని.. నందమూరి కుటుంబంతో తారకరత్నకు పెద్దగా సంబంధాలు లేవని ప్రచారం జరిగింది. దానికి తెరదించుతూ నందమూరి బాలక్రిష్ణ అన్నీతానై వ్యవహరించారు. యావత్ నందమూరి కుటుంబమే కదిలి వచ్చింది.
భర్త ఆశయాలతో..
అయితే భర్త తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అలేఖ్యారెడ్డి తరచూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతుంటారు. తనకున్న ప్రేమాభిమానాల్ని పాలుపంచుకుంటారు. ఇవన్నీ భావోద్వేగంతో కూడుకున్నవే. తరచూ ఈ పోస్టులు వైరల్ గా మారుతుంటాయి. అయితే ఈ క్రమంలో ఓ వార్త బయటకు వచ్చింది. తారకరత్న సినిమాల్లో సక్సెస్ కాలేని సంగతి తెలిసిందే. రాజకీయంగా ముద్ర చాటుకుంటున్న తరుణంలో ఆయన అకాల మృతిచెందారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో పోటీచేస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు అదే ప్రచారం అలేఖ్యారెడ్డిపై సాగుతోంది.

 

తారకరత్న ఆసక్తి..

టీడీపీ హైకమాండ్ నా సేవలను ఎలా వినియోగించుకున్నా పర్వాలేదని.. ఎక్కడి నుంచి బరిలో దిగమన్నా దిగుతానని చాలా సందర్భాల్లో తారకరత్న చెప్పుకొచ్చారు. అయితే ఫైనల్ గా మాత్రం గట్టి ప్రత్యర్థిగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారన్న టాక్ నడిచింది. టీడీపీ ఉండి.. ఎమ్మెల్యే అయి.. తర్వాత వైసీపీలో చేరి తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన కొడాలి నాని లెక్క తేల్చేందుకు వీలుగా నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్నకు టికెట్ ఇవ్వాలని అటు చంద్రబాబు భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తారకరత్న అకాల మరణంతో ఆ అంశం మరుగునపడింది. ఇప్పుడు అలేఖ్యారెడ్డి ప్రస్తావన వచ్చింది.
డిఫెన్స్ లో చంద్రబాబు..
అయితే గుడివాడ విషయంలో చంద్రబాబు అచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. మరో ఎన్ఆర్ఐ రాము సైతం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రత్యర్థి కొడాలి నాని కావడంతో బలమైన అభ్యర్థి అవసరం. దీంతో ఆ ఇద్దర్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అలేఖ్యారెడ్డి విషయం ఎటూ పాలుపోవడం లేదు. అటు చంద్రబాబు సైతం డిఫెన్స్ లో పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే భర్త ఆశయాన్ని నెరవేర్చేందుకు అలేఖ్యారెడ్డి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరీ.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular