https://oktelugu.com/

టీఆర్ఎస్ కు తమిళసై తిప్పలు

తెలంగాణలో గవర్నర్ తమిళ సై  బీజేపీ బలోపేతానికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంగట్లో బెల్లం,ఆత్మలో విషం లాగా గవర్నర్ ఉంటున్నారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నరట.  రాష్ట్రంలో 2023లో జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించే ప్రణాళికలో భాగంగానే తమిళసై ని గవర్నర్ గా నియమించిందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ.. తమిళసై కూడా బీజేపీ నాయకులకు అందుబాటులో ఉంటారని, తద్వారా ప్రభుత్వ   వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 10:28 AM IST
    Follow us on

    తెలంగాణలో గవర్నర్ తమిళ సై  బీజేపీ బలోపేతానికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంగట్లో బెల్లం,ఆత్మలో విషం లాగా గవర్నర్ ఉంటున్నారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నరట.  రాష్ట్రంలో 2023లో జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించే ప్రణాళికలో భాగంగానే తమిళసై ని గవర్నర్ గా నియమించిందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

    Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ..

    తమిళసై కూడా బీజేపీ నాయకులకు అందుబాటులో ఉంటారని, తద్వారా ప్రభుత్వ   వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పక్కా వ్యూహంతోనే తమిళ సై ని పంపించినట్టు గా తెలుస్తోంది.

    తెలంగాణ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉండటం, దూకుడుగా వ్యవహరిస్తుండటం కొంత పార్టీకి అనుకూలంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో తమిళిసై మరింత దూకుడుతో వ్యవహరిస్తారన్న టాక్ బలంగా విన్పిస్తోంది.

    అయితే కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై కూడా అసహనం వ్యకం చేశారు. ఓసారి స్వయంగా లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు కూడా.

    కరోనా వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తమ మాటను పట్టించుకోలేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని, కనీసం తాను పిలిపించినా అధికారులు సమావేశాలకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Also Read: టీఆర్ఎసోళ్లు మాయ చేశారే!

    ఆ సమయంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల కంటే దూకుడుగా వ్యవహరిస్తూ, వివిధ ఆస్పత్రులను సందర్శిస్తూ, వైద్యులతో భేటీ అవుతూ, హడావుడి చేశారు.

    కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్ ను కలుస్తూ మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందజేస్తున్నారు. కానీ గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ నేతలకు అనేక అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడినట్లు తెలుస్తోంది.

    గవర్నర్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళినా, ఇబ్బంది పడేది తామేననే అభిప్రాయంలో టిఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అలా అని పూర్తిగా సైలెంట్ అయిపోతే, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలనే భయమూ టీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్