కేసీఆర్ వ్యూహం దెబ్బకొడుతోందా..?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్న కేసీఆర్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలను ఎన్నికల ప్రచార బరిలోకి దింపారు . మరోవైపు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారం రోజుల పాటు కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ.. అయితే బీజేపీ చేస్తున్న ప్రచారానికి అనుగుణంగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నరట. కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ […]

Written By: NARESH, Updated On : November 22, 2020 10:44 am
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్న కేసీఆర్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలను ఎన్నికల ప్రచార బరిలోకి దింపారు . మరోవైపు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారం రోజుల పాటు కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ..

అయితే బీజేపీ చేస్తున్న ప్రచారానికి అనుగుణంగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నరట. కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలసి చర్చించడం హాట్ టాపిక్గా మారింది. ఓల్డ్ సిటీలో పట్టు కోసం కేసీఆర్ ఎంఐఎంతో మితృత్వాన్ని కొనసాగిస్తున్నారు.

బీజేపీ కూడా ఇప్పటికే ఓల్డ్ సిటీని ఒవైసీ కుటుంబానికి అప్పగించిందన్న ప్రచారం ప్రారంభించింది. దీన్ని నిజం చేస్తూ కేసీఆర్ ఒవైసీతో భేటీపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ప్రారంభమవుతుందని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారట.

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో ఎలాగైనా ఈ ఎన్నికలలో బీజేపీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. గ్రేటర్ ఎన్నికలు మాత్రమే కాకుండా పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఒవైసీతో భేటీ అయినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంఐఎం సహకరించనందుకే ఓటమి పాలయ్యామన్న అభిప్రాయమూ ఉందట.

Also Read: పవన్ ను మరోసారి ఇరుకున పెట్టిన బీజేపీ

గతంలో జరిగిన ఎన్నికలో గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఐఎం గణనీయమైన స్థానాలను సాధించింది. మొత్తం గ్రేటర్ లో 150 వార్డులుండగా 99 స్థానాలను టీఆర్ఎస్, 40 స్థానాల వరకూ ఎంఐఎం గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోయినా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే రీతిలో ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో కేసీఆర్ అవగాహనకు వచ్చే అవకాశముంది. తమకు పట్టున్న ప్రాంతంలో ఎంఐఎం బలహీన అభ్యర్థులను పోటీ చేసేలా వ్యూహరచన చేయనున్నారు.

ఇప్పటికే బీజేపీ హిందుత్వ నినాదాన్ని బలంగా తీసుకెళుతోంది. ఎంఐఎం, కేసీఆర్ మిలాఖత్ అయిన విషయాన్ని తీసుకెళ్లి టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చాలన్నది కమలం పార్టీ వ్యూహంగా ఉంది. కానీ కేసీఆర్ ఇవేమీ పట్టించుకోకుండా ఒవైసీతో భేటీ అయి గ్రేటర్ ఎన్నికలపై చర్చించడం బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్