తమిళ రంగానికి చెందిన కమల్ హాసన్, సూర్య లాంటి వారు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ చట్టం సినీపరిశ్రమకు విఘాతమని చెబుతున్నారు. టాలీవుడ్ నుంచి మాత్రం ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ప్రశ్న లేవనెత్తలేదు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశాక కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. గతంలో ఇలా జోక్యం చేసుకుంటే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. కేంద్రం కల్పించుకోవాలంటే తగిన ఆధారాలుండాలని తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి కేంద్రం చట్టం చేయాలనే ఆలోచనకు వచ్చింది.
దేశ వ్యతిరేక భావాలతో సినిమాలు నిర్మిస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం తన ఆధీనంలో ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సినిమాలపై దేశ వ్యతిరేకత ముద్ర వేస్తున్నారు. ఈ చట్టం వస్తే సినిమాలపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కేంద్రం అనుకున్నట్లుగా చట్టం తీసుకువస్తే సృజనాత్మకత పూర్తిగా ఒక వైపే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ వ్యతిరేకత అంశాలపై సినిమాలు తీసినా వాటిని బయటకు రానీయడం లేదు. మనం ఎంత గోల చేసినా లాభం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛను కేంద్రం ఈ చట్టం నియంత్రిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. తమిళ, హిందీ రంగానికి చెందిన కొంత మంది ఈ చట్టంపై విమర్శలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నటులకు ఈ చట్టంపై అవగాహన ఉందా లేదా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.