Tamil Nadu Shocking Incident: అది మామూలు దారుణం కాదు. అసలు మనుషులెవరూ అలా ఆలోచించరు. మనిషి పుట్టుక పుట్టిన వారు అలాంటి పనులు చేయరు. పైగా కన్నతల్లి అలాంటి పని చేయడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. తన కడుపులో పుట్టిన పిల్లలను తాను అలా చేయడం కలకలం కలిగించింది.. సాధారణంగా ఒక పాము పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత శాపం వల్ల వాటిని అది తినేస్తుంది. అది సృష్టి ధర్మం. కానీ మనుషులకు అలా లేదు. ఉండదు కూడా. కానీ ఈ మహాతల్లి తల్లి అనే పదానికే చెడ్డ పేరు తీసుకొచ్చింది. మాతృత్వానికి తీరని కళంకాన్ని ఆపాదించింది. ఈమె చేసిన దారుణం సభ్య సమాజమే కాదు.. చివరికి న్యాయస్థానాన్ని కూడా ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. దీంతో ఆ తల్లి, తన ప్రియుడితో కలిసి చేసిన పనికిమాలిన పనికి అత్యంత కఠినమైన శిక్షను విధించింది.
Also Read: అంత్యక్రియలు నిర్వహిస్తుండగా కళ్ళు తెరిచిన వృద్ధుడు.. షాకింగ్ ఘటన వైరల్?
సరిగ్గా 2018 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో అజయ్ (6), కరిణిక (4) అనే ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ పిల్లలు విజయ్, అభిరామి అనే దంపతుల సంతానం. విజయ్, అభిరామి మొదట్లో బాగానే ఉండేవారు. అయితే అభిరామికి మీనాక్షి సుందరం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ప్రియుడు మోజులో పడిన అభిరామి భర్త విజయ్, ఇద్దరు పిల్లల్ని చంపడానికి ప్రణాళిక రూపొందించింది. అయితే ఆరోజు విజయ్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.. అతడు వచ్చే లోగానే ఇద్దరు పిల్లల్ని అభిరామి చంపేసింది. అంతేకాదు ప్రియుడితో వెళ్ళిపోయింది. పిల్లల్ని చంపుతున్నప్పుడు ఆమెలో ఏమాత్రం మానవత్వం కనిపించలేదు. పైగా అత్యంత కర్కశంగా వారిద్దరిని చంపేసింది.
Also Read: ధర్మస్థల హత్యల వివాదం.. పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదులో నిజముందా?
విజయ్ ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు పిల్లలు చనిపోయి కనిపించారు.. దీంతో విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి.. అభిరామి, మీనాక్షి సుందరాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారణ ఖైదీలుగా జైలులో ఉంచారు. ఈ నేపథ్యంలో అనేక విచారణలు జరిగిన తర్వాత కీలక ఆధారాలను పోలీసు శాఖ కోర్టుకు సమర్పించడంతో.. తమిళనాడులోని కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ కీలక తీర్పును వెల్లడించారు. ఇద్దరు పిల్లల్ని చంపిన అభిరామికి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరానికి చచ్చేంత వరకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అంతేకాదు చెరి 15వేల రూపాయలను జరిమానాగా చెల్లించాలని తన తీర్పులో ప్రకటించారు. ” ఆమెను తల్లి అనడానికి లేదు. కసాయి కంటే హీనం. ప్రియుడి మోజులో పడి పిల్లల్ని చంపేసింది. ఇటువంటి వారికి కఠిన శిక్ష అమలు చేయాల్సిందే. అందువల్లే ఈ తీర్పు వెల్లడిస్తున్నానని” న్యాయమూర్తి ప్రకటించారు. న్యాయమూర్తి తీర్పు తర్వాత అభిరామి కోర్టు మహిళ కానిస్టేబుల్ కాళ్లు పట్టుకొని ఏడ్చింది. అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఆమె మీద సానుభూతి చూపించకపోవడం విశేషం.