Pawan Kalyan Actress Love: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ రీసెంట్ గానే విడుదలై ఎలాంటి ఫలితాన్ని అందుకుందో మనమంతా చూశాము. ఈ మూవీ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి ని పైకి పిలిచి సెల్ఫీ ఇస్తాడు గుర్తుందా?, ఆ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియా అంతంతా ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇంతకీ ఎవరు ఈ అమ్మాయి?, పవన్ కళ్యాణ్ దృష్టిని ఎలా అంత ప్రత్యేకంగా ఆకర్షించింది?, ఇంత వీరాభిమానం పవన్ కళ్యాణ్ పై ఎలా?, ఇంతకు ముందు ఈమె ఏమైనా సినిమాలు చేసిందా?, వంటి వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో లో కనిపించిన అమ్మాయి పేరు నివితా. ఈమె ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో కూడా ఒక చిన్న క్యారక్టర్ చేసింది. ఆ చిత్రం క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం లో ఈమె ఉంటుంది.
Also Read: కోర్ట్, కన్నప్ప కంటే దారుణమా…. హరి హర వీరమల్లుకి ఊహించని దెబ్బ!
పెద్దగా గుర్తించుకోదగ్గ క్యారక్టర్ ఈమె చేయలేదు కానీ ఈ ఈవెంట్ తో మాత్రం ఆమె జనాల్లో బాగా హైలైట్ అయ్యింది. ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆరోజు తనకు జరిగిన ఆ మ్యాజిక్ మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఈ సినిమాలో నటించాను. కానీ నన్నెవరూ ఈ ఈవెంట్ కి ఆహ్వానించలేదు. నాకు తెలిసిన ఒక మీడియా పర్సన్ ఈ ఈవెంట్ కి వెళ్తుంటే కళ్యాణ్ గారిని చూసి వెళ్లొచ్చు అనే ఉద్దేశ్యంతో నేను అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన వెంటనే కళ్యాణ్ గారి పర్సనల్ అసిస్టెంట్ నన్ను చూసి, మీరేంటి ఇక్కడ నిలబడ్డారు. ముందుకు వెళ్ళండి అన్నాడు. ఆమ్మో నాకు భయం సార్ నేను వెళ్ళలేను, మీరు కూడా వస్తానంటే మీ వెనుక తోకలాగా వచ్చేస్తాను అని అన్నాను. అప్పుడు ఆయన నేను బాగా అలిసిపోయి ఉన్నాను అమ్మా, పర్లేదు నువ్వు వెళ్ళు అన్నాడు’.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఫలితంపై డైరెక్టర్ క్రిష్ హాట్ కామెంట్స్!
‘అమ్మో నాకు భయం సార్ అని నేను చెప్పాను. ఎందుకమ్మా భయం, నువ్వు కూడా ఆ సినిమాలో పని చేసావు కదా, ముందుకు వెళ్లి అయినా ఆ ఈవెంట్ ని చూడు అని చెప్పాడు. నిజంగా ఆరోజు నన్ను ఆయన అంత పుష్ చేసి ఉండకపోయుంటే నేను వెళ్లేదానిని కాదు. ఆరోజు కళ్యాణ్ గారు మన చరిత్ర గురించి, ఔరంగజేబు గురించి చెప్తూ ఉంటే అలా వింటూ లీనమైపోయాను. అప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను గమనించి మీరు ఈ సినిమాలో నటించారు కదా అని అడిగారు. వెంటనే పైకి పిలిచి సెల్ఫీ’ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. ఈమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంత అందంగా ఉంది, ఈమె ఎందుకు ఇంకా పెద్దగా పాపులర్ అవ్వలేదు?, ఇప్పుడు ఈ సంఘటన తో పాపులర్ అయ్యింది కదా, రాబోయే రోజుల్లో ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.