Andhra Cyclone Alert: ఉత్తరాంధ్రకు( North Andhra ) భారీ వర్ష సూచన. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆకాశం మేఘావృతం అయి ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి 45 నుంచి 55 వేగంతో గాలులు వీస్తుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళలేదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగానే ముందుకు సాగుతుండడంతో ఏపీకి పెను ప్రమాదం తప్పినట్లు అయింది.
Also Read: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా.. జగన్ బ్రహ్మాస్త్రం!
ఉత్తరాంధ్రకు బిగ్ అలెర్ట్
అయితే అల్పపీడనం తీరం దాటినా.. ఉత్తరాంధ్రకు మాత్రం భారీ వర్ష సూచన ఉంది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం( Srikakulam), విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. అయితే వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు ప్రయాణించి బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తీరిన వర్షం లోటు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదు అయ్యాయి. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. అల్లూరి సీతారామరాజు( Alluri sitaramaraju ) జిల్లా ముంచంగిపుట్టులో గరిష్టంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పది మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ఉసురు వాతావరణం కొనసాగుతోంది. ఐదు ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగుపడింది. రాయలసీమలో మాత్రం వర్షం లోటు కనిపిస్తోంది.
Also Read: ప్లీజ్ పవన్ కళ్యాణ్.. అంబటి వింత కోరిక వైరల్!
హోంమంత్రి సమీక్ష..
మారిన వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తాడేపల్లి లోని( Tadepalli) విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోస్తాంధ్రకు వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.