స్టాలిన్‌లో మొదలైన కలవరం

తమిళనాడులో ఎన్నికలు హీట్‌ ఎక్కిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 234 సీట్లకు ఈ ఎన్నికలు జరిగాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల ఫలితాలతో పాటే తమిళనాడు ఎన్నికల ఫలితాలను కూడా మే 2న ప్రకటించనున్నారు. అయితే.. ఇప్పటికే అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఫస్ట్‌ టైమ్‌ అక్కడ జయలలిత.. కరుణానిధి లేకుండా ఎన్నికలు జరిగాయి. స్టాలిన్‌ తన అభ్యర్థులపైననే దృష్టి […]

Written By: Srinivas, Updated On : April 11, 2021 8:19 am
Follow us on


తమిళనాడులో ఎన్నికలు హీట్‌ ఎక్కిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 234 సీట్లకు ఈ ఎన్నికలు జరిగాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల ఫలితాలతో పాటే తమిళనాడు ఎన్నికల ఫలితాలను కూడా మే 2న ప్రకటించనున్నారు. అయితే.. ఇప్పటికే అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఫస్ట్‌ టైమ్‌ అక్కడ జయలలిత.. కరుణానిధి లేకుండా ఎన్నికలు జరిగాయి. స్టాలిన్‌ తన అభ్యర్థులపైననే దృష్టి పెట్టారు. ఇక కాంగ్రెస్‌ అగ్రనేతలు కూడా తమకు కేటాయించిన స్థానాలను మాత్రమే పట్టించుకొని తిరిగింది. అక్కడ ప్రధానంగా డీఎంకే.. అన్నాడీఎంకేలా మధ్యనే పోరు నడిచింది.

ఇప్పటివరకు ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేకుండా ఉంది. కానీ.. డీఎంకే అధినేత స్టాలిన్‌లో మాత్రం ధీమా కనిపిస్తోంది. తానే ముఖ్యమంత్రినంటూ విశ్వాసంతో ఉన్నారు. అయితే.. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత చేసిన సర్వే ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు ప్రజలు డీఎంకే పార్టీకే పట్టం కట్టబోతున్నట్టు సర్వేలు అంటున్నాయి. మెజారిటీ ప్రజలు ఉదయిస్తున్న సూర్యుడి గుర్తుకే ఓటేసినట్టు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు అత్తెసరు సీట్లు కట్టబెట్టబోతున్నారట.

ఇదిలా ఉండగా.. స్టాలిన్‌ ఒకవేళ అధికారంలోకి వచ్చిన కూడా మిత్రపక్షాలపై ఆధారపడకుండా ఉండాలన్నది డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది. ముందు నుంచి మిత్రపక్షాలకు పరిమిత స్థాయిలోనే సీట్లు కేటాయిస్తామంటూ చెప్పుకొచ్చిన స్టాలిన్‌.. చివరికి అదే చేశారు. మిత్రపక్షాల అసంతృప్తిని లెక్కల్లోకి తీసుకోకుండా తక్కువ స్థానాలనే కేటాయించారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ కేవలం 25 సీట్లు మాత్రమే కేటాయించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు కూడా తమకు కేటాయించిన స్థానాలకే పరిమితమై ప్రచారం నడిపించారు.

అయితే.. ఇప్పుడు ఇదే అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ సహకరించకుంటే మిగతా నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థుల పరిస్థితి ఏంటని తెలియకుండా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో వారు సహకరించకుంటే గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి. అందుకే.. ఇప్పుడు మిత్రపక్షాలతో ఆయన మాటిమాటికి సమావేశం అవుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని.. ఇందుకు అందరూ సహకరించాలని కోరుతున్నారు. ఇరువైపులా నుంచి సహకారం అందితేనే అధికారం సాధ్యమవుతుందని స్టాలిన్‌ వారికి గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైతే సహకరిస్తామన్నట్లు ఉన్న కాంగ్రెస్ చివరికి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటనే కలవరం కూడా స్టాలిన్‌ను వెంటాడుతోంది.