
తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో, ఓటర్లను ఆకట్టుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా యి. ముఖ్యంగా సీఎం పళనిస్వామి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి.
మరోవైపు.. అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకుల గుర్తుకే ఓటు వేయాలని సీఎం పళనిస్వామి విజ్ఞప్తి చేస్తుంటే, ఉదయ్ సూర్యుడికి ఓటేస్తే ప్రజల హక్కులను కాపాడుతూ.. సుపరిపాలన సాగిస్తామని స్టాలిన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మూడో కూటమిగా ఏర్పడిన మక్కల్ నీది మయ్యం, సమత్తువ మక్కల్ కట్చి, జననాయగ కట్చిలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అలాంటి మార్పును తీసుకురావడానికి ఐజేకే కూటమి ప్రయత్నం చేస్తుందని యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేస్తున్నారు. పరిపాలనలో ఒక మార్పు తీసుకు వస్తామని ప్రజలకు ప్రమాణం చేస్తున్నామని, వాస్తవికతకు దగ్గరగా ఉండే తమ మేనిఫెస్టోను చూసి ఓటేయాలని కమల్ హాసన్ అభ్యర్థిస్తున్నారు. ఇక ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు .
ఇదిలా ఉంటే.. బీజేపీ నుండి ఎన్నికల ప్రచారంలోకి స్టార్ క్యాంపెయిన్‌గా నేరుగా రంగంలోకి దిగిన గౌతమి కమల్ హాసన్‌పై ఫైర్ అయ్యారు. కమల్ హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి, కొన్నేళ్లపాటు ఆయన స్నేహితురాలిగా మెలిగిన, ఆయనతో కలిసి సహజీవనం చేసిన గౌతమి ఇప్పుడు కమల్ హాసన్‌పై విరుచుకుపడుతున్నారు. కమల్ హాసన్‌తో అభిప్రాయ భేదాల కారణంగా ఆయనకు దూరంగా ఉంటున్న గౌతమి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన గౌతమి కమల్‌ను టార్గెట్ చేశారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్