ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 130 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏడాది కాలపరిమితితో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కోసం సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది కాలపరిమితితో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.
Also Read: 3479 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..?
https://apprenticeshipindia.org>, https://hpep.bhel.com/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 11 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నాటికి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి విషయంలో సడలింపులు ఉంటాయి. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి. https://apprenticeshipindia.org/ లేదా https://hpep.bhel.com/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ లో 56 జాబ్స్..?
నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం 130 ఖాళీలలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెషినిస్ట్ గ్రైండర్, టర్నర్, వెల్డర్, కార్పెంటర్, ఫౌండ్రీ మ్యాన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.