సాధారణంగా కిలో పాత పేపర్ ధర 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఉంటుంది. అయితే పాత పేపర్ కొరత ఏర్పడటంతో పాత పేపర్లకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రధాన నగరాలలో పాత పేపర్ల రేటు కిలో 35 రూపాయల నుంచి 40 రూపాయలుగా ఉండటం గమనార్హం. రోజురోజుకు పాత పేపర్లకు డిమాండ్ పెరుగుతుండగా కరోనా విజృంభణ తరువాత పేపర్ ను కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా తగ్గింది.
Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మరింత తగ్గే ఛాన్స్..?
భవిష్యత్తులో పాత పేపర్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి పాత పేపర్లను విక్రయించని వాళ్లు సులభంగా వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పాత పేపర్లను కొని నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలలో విక్రయించడం గమనార్హం. కరోనా ఉధృతి తగ్గి చిరు వ్యాపారుల వ్యాపారాలు పుంజుకోవడంతో పాత పేపర్లకు డిమాండ్ పెరిగింది.
Also Read: రైతులకు శుభవార్త.. ఈ పంటతో రూ.8 లక్షల ఆదాయం..?
కరోనా విజృంభణ తరువాత నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండగా పాత పేపర్లకు కూడా డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. పాత పేపర్లను విక్రయించే వ్యాపారం చేసేవాళ్లకు సైతం రేట్లు పెరగడం వల్ల లాభాలు భారీగా పెరిగాయని తెలుస్తోంది. వార్తాపత్రికల రేట్లు గతంతో పోలిస్తే భారీగా పెరిగిన నేపథ్యంలో పాత పేపర్లు ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.
తాజాగా అదిలాబాద్ కు చెందిన వ్యాపారి ఒకరు 10 టన్నుల పాత పేపర్లను గుజరాత్ నుంచి కొనుగోలు చేసి నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాలలో విక్రయించడం గమనార్హం.