The Taliban in Afghanistan: రష్యా వల్లే తాలిబన్లు బలపడ్డారా?

తాలిబన్లకు ఆయుధాలు దొరకడంతోనే రెచ్చిపోయారని తెలుస్తోంది. అఫ్గాన్ లో జరుగుతున్న పరిణామాల్లో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. అఫ్గాన్ లో సోవియట్ దురాక్రమణ ముగిశాక అంతర్యుద్ధం మొదలయ్యాకే ముజాహిదీన్ లు వారిలో వారే ఘర్షణలకు పాల్పడ్డారని సమాచారం. వారికి దొరికిన ఓ ఆయుధ డంపుతోనే తాలిబన్లు రష్యా వ్యాపారి విమానాన్ని హైజాక్ చేశారు. 1979లో సోవియట్ యూనియన్ అఫ్గాన్ లో అడుగుపెట్టినప్పట నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. 1979-89 మధ్యలో జరిగిన సివిల్ వార్ సమయంలో అమెరికా […]

Written By: Raghava Rao Gara, Updated On : August 17, 2021 7:59 pm
Follow us on

తాలిబన్లకు ఆయుధాలు దొరకడంతోనే రెచ్చిపోయారని తెలుస్తోంది. అఫ్గాన్ లో జరుగుతున్న పరిణామాల్లో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. అఫ్గాన్ లో సోవియట్ దురాక్రమణ ముగిశాక అంతర్యుద్ధం మొదలయ్యాకే ముజాహిదీన్ లు వారిలో వారే ఘర్షణలకు పాల్పడ్డారని సమాచారం. వారికి దొరికిన ఓ ఆయుధ డంపుతోనే తాలిబన్లు రష్యా వ్యాపారి విమానాన్ని హైజాక్ చేశారు. 1979లో సోవియట్ యూనియన్ అఫ్గాన్ లో అడుగుపెట్టినప్పట నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. 1979-89 మధ్యలో జరిగిన సివిల్ వార్ సమయంలో అమెరికా తన మిత్ర దేశాల నుంచి కొన్ని వేల టన్నుల ఆయుధాలను సమీకరించి పాక్ ఐఎస్ఐ సాయంతో ఇక్కడకు తరలించింది.

1980లో నాలుగు లక్షల కలష్నికోవ్ రైఫిల్స్ సరఫరా చేసింది. రష్యన్లు అఫ్గాన్ నుంచి వెళ్లిపోయాక కూడా నజీబుల్లా పాలన అంతమయ్యా కూడా ప్రపంచ దేశాల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు ఇక్కడకు చేరాయి. 1992నుంచి అఫ్గాన్ లో ఇస్లామిక్ చట్టాల అమలు, ఇతర సామాజిక పరిస్థితులపై అసంతృప్తిగా ఉన్న ముల్లా ఒమర్ 1994లో తాలిబన్ సంస్థను స్థాపించారు. తొలుత 50 మందితో మొదలై కొద్ది నెలల్లోనే వీరి సంఖ్య దాదాపు 15 వేలకు చేరుకుంది. ఇందులో అధికంగా అఫ్గాన్ వస్తూన్ ముజాహిదీన్ లు ఉన్నారు.

1994లో స్పిన్ బౌల్దక్ వద్ద తాలిబన్ ఫైటర్లు భారీ సంఖ్యలో ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధ డంపులో వేల సంఖ్యలో కలష్నికోవ్ రైఫిల్స్, 120 శతఘ్నులు, భారీ సంఖ్యలో చిన్న ఆయుధాలు లభ్యమయ్యాయి. దాదాపు 800 ట్రక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లోనే హెక్మత్మార్ నేతృత్వంలోని హబీబ్ ఇ ఇస్లామి సేనలను జయించి కాందహార్ పట్టణాన్ని విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే సరిహద్దులోని స్పిన్ బౌల్దక్ వద్ద చమర్ చెక్ పోస్టు తాలిబన్ల వశం కావడంతో పాక్ వైపు నుంచి భారీ సంఖ్యలో ఫైటర్లు కాందహార్ ఆక్రమణకు తాలిబన్లలో చేరారు.

1995 ఆగస్టు 3వ తేదీన అలబానియా నుంచి అఫ్గానిస్తాన్ కు బయలుదేరింది. ఈ విమానాన్ని తాలిబన్లు మిగ్ 21 యుద్ధ విమానంతో అడ్డగించి బలవంతంగా కాందహార్ ఎయర్ పోర్టులో దింపారు. సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. దీంతో ఏడుగురు రష్యన్ సిబ్బంది, 30 టన్నుల ఆయుధాలు ఉన్నాయి. దీంతో దాదాపు ఏడాదిపాటు రష్యా-తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా సెనెటర్ హాంక్ బ్రౌన్ మధ్యవర్తిత్వం నడిపారు. ఈ క్రమంలో ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది అనంతరం విమాన మెయింటెనెన్స్ కు రష్యా సిబ్బందిని తాలిబన్లు అనుమతించారు.

తాలిబన్ల చేతికి ఆయుధాలు దొరకడం అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి వారికి ఆయుధం దక్కితే ఉన్మాదులుగా మారిపోతారు. బగ్లాం ఎయిర్ బేస్ లో అమెరికన్ సైనికులు ఉపయోగించే చాకులు, కత్తులు, చిరు ఆయుధాలను ధ్వంసం చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటిది భారీ ఆయుధాలను ధ్వంసం చేయకుండా తాలిబన్ల పరం చేయడం అనాలోచితం. ఇప్పుడు కూడా అమెరికా ఆయుధాలు వారి చేతిలో పడటంతో శక్తిమంతులుగా మారి చివరికి కాబుల్ ను ఆక్రమించారు.