https://oktelugu.com/

టి.కాంగ్రెస్ ప్రక్షాళన: యువమంత్రం.. సీనియర్లు అంతా ఔట్

తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం ప్రక్షాళన చేసింది. టీడీపీ నుంచి వలస వచ్చిన నేత రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించడమే ఓ సంచలనంగా మారింది. అంతేకాదు.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన ఆయన ప్రత్యర్థులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి, జీవన్ రెడ్డి, వీ.హనుమంతరావు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, జానారెడ్డి సహా చాలా మందిని పక్కనపెట్టడం పెను సంచలనమైంది. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారైతే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2021 9:22 pm
    Follow us on

    తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం ప్రక్షాళన చేసింది. టీడీపీ నుంచి వలస వచ్చిన నేత రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించడమే ఓ సంచలనంగా మారింది. అంతేకాదు.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన ఆయన ప్రత్యర్థులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి, జీవన్ రెడ్డి, వీ.హనుమంతరావు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, జానారెడ్డి సహా చాలా మందిని పక్కనపెట్టడం పెను సంచలనమైంది.

    కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారైతే తమకే పీసీసీ కావాలని పట్టుబట్టారు. వీ హనుమంతరావు అయితే ఏకంగా రేవంత్ రెడ్డి పీసీసీ కాకుండా గళమెత్తాడు. కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామని కూడా బెదిరించారు. కానీ వీరందరి బెదిరింపులను తోసిరాజని కాంగ్రెస్ అధిష్టానం యువకుడు, ఉత్సాహవంతుడు, కేసీఆర్ ను నేరుగా ఢీకొడుతున్న రేవంత్ రెడ్డికే పట్టం కట్టడం విశేషం.

    టీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా యువ తమిళనాడు ఎంపీనే. ఆయన కాంగ్రెస్ మొత్తం వ్యవహారాలను ఆవపోసన పట్టాడు. కేసీఆర్ కు విధేయులుగా ఉంటూ కొందరు కాంట్రాక్టులు పనుల కోసం కాంగ్రెస్ నీరు గారుస్తున్నారన్న నివేదికలు ఆయనకు అందాయట.. అందుకే కేసీఆర్ తో లాలూచీ ఉన్న వారందరినీ పక్కనపెట్టి రేవంత్ రెడ్డితోపాటు అడ్డంగా గట్టిగా నిలబడే వారికే పీసీసీ కార్యవర్గంలో చేర్చడం విశేషం.

    ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ లను పక్కనపెట్టడం సంచలనమైంది. వీరంతా ఫైర్ బ్రాండ్లు అయినా కూడా ఏ పదవిని కాంగ్రెస్ ఇవ్వలేదు.జాతీయ కమిటీలోనూ చోటు కల్పించలేదు.

    దీన్ని బట్టి కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ ను ఢీకొట్టే నేతకే పట్టం కట్టిందని తెలుస్తోంది. సీనియర్లతో తెలంగాణ కాంగ్రెస్ బండి నడవదని డిసైడ్ అయ్యింది. అందుకే వారందరిలో ఒక్కరికి కూడా పదవి ఇవ్వకుండా పూర్తిగా పక్కనపెట్టింది. ఈ పరిణామం తెలంగాణ సీనియర్లకు షాకింగ్ అని చెప్పొచ్చు. పూర్తి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు రేవంత్ రెడ్డికేనని.. అతడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. రేవంత్ ను ప్రశ్నించకుండా అడ్డుతగకుండా సీనియర్లను పక్కనపెట్టిన వైనం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చకు కారణమవుతోంది.