సీనియర్లకు షాక్: తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి

ఎన్నో సమీక్షలు.. ఎన్నో వ్యతిరేకతలు.. ఎందరో పోట్లు.. అడ్డంకులు.. ఇలా అన్నింటిని దాటుకుంటూ చివరకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలను అతి కష్టం మీద అందుకున్నాడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ కొద్ది సేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహ్మద్ అజారుద్దీన్, జే.గీతారెడ్డి, […]

Written By: NARESH, Updated On : June 26, 2021 8:21 pm
Follow us on

ఎన్నో సమీక్షలు.. ఎన్నో వ్యతిరేకతలు.. ఎందరో పోట్లు.. అడ్డంకులు.. ఇలా అన్నింటిని దాటుకుంటూ చివరకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలను అతి కష్టం మీద అందుకున్నాడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ కొద్ది సేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు.

ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహ్మద్ అజారుద్దీన్, జే.గీతారెడ్డి, ఎం అంజన్ కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి. మహేష్ కుమార్ గౌడ్ లు నియమితులయ్యారు.

ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్ రెడ్డి,మల్లు రవి, పాడెం వీరయ్య, సురేష్ షెట్కర్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి. కుమార్ రావు, జావేద్ అమీర్ లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాస్కీ గౌడ్, కన్వీనర్ గా అజమ్ తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఏలేటీ మహేశ్వర్ రెడ్డిలను నియమించారు.

మొత్తంగా టీపీసీసీ కోసం పోటీపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జానారెడ్డిలు, మల్లు భట్టి విక్రమార్కలకు అసలు ఈ టీపీసీసీ కమిటీల్లోనే చోటు కల్పించకుండా కాంగ్రెస్ అధిష్టానం గట్టి షాకిచ్చినట్టైంది.