Swami Shivananda Viral Video: స్వామి శివానంద.. 125 ఏళ్ల స్వామిజీ.. ఇంత వయసులో ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటున్నారు. 1896 ఆగస్టు 8న అప్పటి భారతదేశంలోని సిల్హెత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భాగం) జిల్లాలో నిరుపేత కుటుంబంలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అనంతరం పశ్చిమ బెంగాల్ లోని ఓ ఆశ్రమయంలో పెరిగాడు. గురు ఓంకారనంద గోస్వామి పెంచి పెద్ద చేశారు. యోగా, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని సన్యాసం తీసుకొని సేవకే తన జీవితం అంకితం చేశారు.
Swami Shivananda
గత 50 ఏళ్లు తన జీవితాన్ని సమాజసేవకే అంకితం చేశాడు స్వామి శివానంద.. 400-600మంది కుష్టు రోగులకు పూరిలో సేవ చేస్తున్నారు. నిత్యం యోగా సాధన చేసే స్వామి శివానంద 125 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా.. ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలో కరోనా రెండు డోసులు టీకా తీసుకున్న అత్యంత పెద్ద వయస్కుడు ఈయనే.
కేంద్రం ఈయన సేవలు గుర్తించి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. తాజాగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ పురస్కారాల కార్యక్రమానికి ఈయన సాదాసీదాగా అత్యంత సామాన్యుడిగా వచ్చి పురస్కారాన్ని స్వీకరించడం అందరినీ ఎమోషన్ కు గురిచేసింది. తెల్లటి ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా వచ్చిన స్వామి శివానందను చూసి అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు.
ఇక స్వామి శివానంద పద్మశ్రీ అందుకునేందుకు వేదికపైకి వస్తూ మొదట ప్రధాని మోడీకి పాదాభివందనం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే మోడీ కూడా మొత్తం కిందకు భూమిని తాకేలా వంగి ప్రతి నమస్కారం చేశారు. స్వామిజీకి తగిన గౌరవం ఇచ్చాడు.
ఆ తర్వాత రాష్ట్రపతికి ఇలానే పాదాభివందనం చేశాడు శివానంద. అయితే రాష్ట్రపతి వారించి పైకి లేపి అలా చేయకూడదని అవార్డును అందజేశారు. శివానంద సంస్కరానికి హాలులో ఉన్నంత వారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు.ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సహా ఆనంద్ మహీంద్రాతోపాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్వామి శివానంద తీరును కొనియాడారు. ఇది హృదయాన్ని కదిలించే వీడియో అంటూ మెచ్చుకున్నారు.
Also Read: Petrol Diesel Price Hike: అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయే.. మోడీ సార్ వీర బాదుడు మొదలాయే
So heart touching 😢
125 Year old Yoga Guru from Kashi, Swami Sivananda receives Padma Shri for his immense contribution in the field of #Yoga#PadmaAwards #PeoplesPadma #PadmaAwards2022 #PadmaShri pic.twitter.com/1PKLHzezOT— Kiren Rijiju (@KirenRijiju) March 21, 2022
Recommended Video: