spot_img
Homeఎంటర్టైన్మెంట్Social Media Matters Of RRR Movie Celebrities: ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబ‌ర్స్ కు సోష‌ల్...

Social Media Matters Of RRR Movie Celebrities: ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబ‌ర్స్ కు సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోవ‌ర్ల సంఖ్య తెలుసా..?

Social Media Matters Of RRR Movie Celebrities:  సినీ సెల‌బ్రిటీల‌కు సోష‌ల్ మీడియాలో ఉన్నంత ఫాలోయింగ్ మరెవ‌రికీ ఉండ‌రేమో. ఎందుకంటే వారు నిత్యం జ‌నాల్లో అంత క్రేజ్‌ను క‌లిగి ఉంటారు. అయితే మ‌న టాలీవుడ్‌లో కూడా చాలామంది సెలబ్రిటీలు నిత్యం నెట్టింట్లో సంద‌డి చేస్తుంటారు. కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ స్టార్ల‌కు సోష‌ల్ మీడియాలో ఎంత‌మంది ఫాలోవ‌ర్లు ఉన్నారో తెలుసుకుందాం.

ముందుగా డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న విష‌యానికి వ‌స్తే.. ఆయ‌నకు ఏ డైరెక్ట‌ర్‌కు లేనంత‌మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక హీరోకు ఉన్నంత మంది ఉన్నారు. అయితే ఆయ‌న‌కు ఫేస్‌బుక్‌లో 7.5మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే ఆయ‌న ఫేస్‌బుక్‌లో కేవ‌లం కీర‌వాణిని మాత్ర‌మే ఫాలో అవుతారు. ఇన్ స్టాలో 1.1, ఇక ట్విట్ట‌ర్‌లో అయితే 5.7మిలియ‌న్ల మంది ఆయ‌న్ను ఫాలో అవుతున్నారు.

SS Rajamouli
SS Rajamouli

ఇక నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రామ్ చ‌ర‌ణ్‌కు బాగానే ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయ‌న‌కు 12మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అలాగే ఇన్ స్టాలో 5.2మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ట్విట్ట‌ర్ లో అయితే 2మిలియ‌న్ల మంది ఆయ‌న్ను అనుక‌రిస్తున్నారు. ఇక వీరి త‌ర్వాత తార‌క్ చాలా త‌క్కువ‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

Also Read:  ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’

 

Social Media Matters Of RRR Movie Celebrities
Ram Charan

ఆయ‌న‌కు ఫేస్‌బుక్‌లో 5.7మిలియ‌న్ల మంది అనుక‌రిస్తుండ‌గా.. ట్విట్ట‌ర్ లో 2 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ఇన్ స్టాలో 3.6మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక వీరంద‌రికంటే ఎక్కువ‌గా ఆలియా భ‌ట్ కు ఎక్కువ‌గా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ట్విట్ట‌ర్‌లో 21.3మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉండ‌గా.. ఇన్ స్టా గ్రామ్‌లో 61.4మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ఫేస్ బుక్‌లో అయితే 8.5మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Social Media Matters Of RRR Movie Celebrities
Jr NTR

ఇక ఒలీవియా మోరిస్‌కు కూడా సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ట్విట్ట‌ర్‌లో 62వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాలో ల‌క్ష‌మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇలా మ‌న త్రిపుల్ ఆర్ టీమ్‌కు సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

Also Read:  ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’

Recommended Video:

పవన్ సీఎం అభ్యర్థి, టీడీపీకి షాక్  | BJP Want to Make Pawan Kalyan as AP CM | Janasena BJP Alliance

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version