Ayodhya Ram Temple: భారత దేశానికే ఒక ఐకానిక్‌గా అయోధ్య రామాలయం నిలిచింది. హిందువుల 500 ఏళ్ల(%00 Years) కలను నెరవేరుస్తూ.. గతేడాది అయోధ్య రామమందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణం పూర్తి చేసి 2024, జనవరి 22న బాలరాముడికి ప్రాణప్రతిష్ట చేశారు. అయోధ్య రాముడిని దేశం నలు మూలల నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. జనవరి 13 నుంచి మహాకుంభమేళా(Maha kumbhamela) జరుగుతోంది. దీంతో కుంభమేళాకు వెళ్లిన భక్తులంతా అయోధ్యకు వెళ్తున్నారు. దీంతో రామాలయం నెలరోజులుగా కిటకిటలాడుతోంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామాలయం ప్రాంగణంలోకి సోమవారం(ఫిబ్రవరి 17న) ఒక డ్రోన్(Drone) వచ్చింది. దీనిని గుర్తించిన భద్రతా అధికారులు అలారం మోగించారు. అనంతరం దానిని కూల్చివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో భక్తులు భయాందోళనకు గురయ్యారు. డ్రోన్‌ను యాంటీ డ్రోన్ వ్యవస్థ కూల్చేసిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
గేట్ నంబర్ 3 వద్ద ఘటన..
ఏరియా అధికారి అశుతోష్ తివారి(Ashitosh thiwari) తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్య రామాలయం మూడో నంబర్ గేట్ సమీపంలోకి సోమవారం డ్రోన్ వచ్చింది. రామ్‌లల్లా దర్శనం తర్వాత భక్తులు ఈ గేటు నుంచే బయటకు వస్తారు. సాయంత్రం సమయంలో డ్రోన్ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా అలారం మోగించారు. అనంతరం డ్రోన్‌ను కూల్చివేశారు.
పోలీసుల అదుపులో నిందితుడు..
ఈ ఘటనపై రామజన్మభూమి పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్‌కుమార్(Sunil Kumar)కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి ప్రాంగణంలోకి డ్యూటీ పాయింట్ బ్యాచింగ్ ప్లాంట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే డ్రోన్ ఎగరవేసినట్లు గుర్తించారు. అయితే కుంభమేళా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆ దృశ్యాలను చిత్రీకరించేందకు డ్రోన్ కెమెరా వదిలినిట్లు తెలుస్తోంది.
యాంటీ డ్రోన్ వ్యవస్థ..
ఇదిలా ఉంటే.. అయోధ్య రామమందిరం ఉపరి తలాన్ని నో ఫ్లై జోన్(No Fly zone)గా ప్రకటించారు. ఆలయం పైనుంచి అనుమతి లేకుండా ఎలాంటి వాటిని అనుమతించరు. చివరకు విమానాలు, హెలిక్యాప్టర్లు కూడా ఎగిరేందుకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ యాంటీ డ్రోన్(Anti Drone)వ్యవస్థను కూడా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇది రెండున్నర కిలోమీటర్ల పరిదిలో ఎగురుతున్న డ్రోన్లపైనా నిఘా ఉంచుతుంది.