Homeబిజినెస్Vivo V50 Launch : కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివా.. ఫీచర్లు విన్నారంటే దిమ్మతిరిగిపోవాల్సిందే

Vivo V50 Launch : కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివా.. ఫీచర్లు విన్నారంటే దిమ్మతిరిగిపోవాల్సిందే

Vivo V50 Launch : ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో.. తాజాగా తన కొత్త మోడల్ వివో వీ50ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ఫీచర్లు, మోడరన్ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదు చేస్తుందని భావిస్తున్నారు. వివో వీ50 భారతదేశంలో మూడు మెమొరీ వేరియంట్లలో లాంచ్ అయింది. వాటి ధరలకు సంబంధించిన వివరాలను చూస్తే.. 8GB RAM + 128GB Storage వేరియంట్ ధర రూ.34,999, 8GB RAM + 256GB Storage వేరియంట్ ధర రూ.36,999, 12GB RAM + 512GB Storage వేరియంట్ ధర రూ.40,999లుగా కంపెనీ నిర్వహించింది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25, 2025 నుంచి ఇది కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

కలర్ ఆప్షన్స్
ఈ ఫోన్ రోజ్ రెడ్, టైటానియం గ్రే, స్టార్రీ నైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ కొనుగోలుకు జీరో డౌన్ పేమెంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సేఫ్టీని అందజేస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.77 అంగుళాల స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 4500 నిట్ పీక్ బ్రైట్‌నెస్.
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
కెమెరా: ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికోసం బ్యాక్ 50MP OIS కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,సెల్ఫీల కోసం 50MP AF సెన్సార్ ను అందజేస్తుంది.
సోఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ OS 15, 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్‌లు.
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3.

ఏఐ ఫీచర్లు:
సర్కిల్ టు సెర్చ్, వివో లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ వంటి ఆధునిక ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త వివో వీ50 ఫోన్, పవర్ ఫుల్ కెమెరా, డ్యూరబుల్ బ్యాటరీ, స్లిమ్ డిజైన్, ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకుంటుందనడంలో సందేహం లేదు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో దీని పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version