మూడ్ ఆఫ్ ది నేషన్.. ప్రతీ ఆరు నెలలకు ఇండియా టుడే నిర్వహిస్తోంది. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది. ఉన్న వాటిల్లో అత్యంత విశ్వసనీయత గల సంస్థ. దీంట్లో కేరళ, తమిళనాడు గురించి ఆసక్తికర విషయాలు తెలిసాయి. గత లోక్ సభ ఎన్నికల్లో కేరళలో 19 శాతం ఎన్డీఏ కూటమికి వచ్చాయి. ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 24 శాతానికి ఎన్డీఏ బలం పెరిగింది.
ఇక తమిళనాడులో గత లోక్ సభ ఎన్నికల్లో 17 శాతం ఎన్డీఏ కూటమికి వచ్చాయి. ఈసారి 21 శాతానికి బలం ఎన్డీఏకు పెరిగింది. ఇది చిన్న విషయం కాదు.
కేరళలో ఎల్డీఎఫ్ 30 శాతం, ఎన్డీఏకు 24 శాతం ఇచ్చారు. రెండింటి మధ్య గ్యాప్ కేవలం 6 శాతం. ఇంకా ఏడాది ఎన్నికలకు ఉంది. కేరళలో ఎన్డీఏ బలం పెరుగుతుండగా.. మిగతా పార్టీల బలం తగ్గుతుంది.
తమిళనాడులో 21 శాతం బీజేపీ కూటమికి రాగా.. అన్నాడీఎంకే కూటమికి 20 శాతానికి పడిపోయింది. మొట్టమొదటి సారి ఎన్డీఏ కూటమి డీఎంకేకు ప్రత్యామ్మాయంగా బీజేపీ కూటమి రావడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. ఏడాదిలో ఎన్నికలున్న సందర్భంలో కేరళ, తమిళనాడులో బీజేపీ పుంజుకుంటోంది.
ఇండియా టుడే సర్వేలో కేరళ తమిళనాట పుంజుకున్న బీజేపీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.