surya grahan 2024 : భారతీయులకు గ్రహణ కాలాలు చాలా ముఖ్యమైనవి. ఏ కార్యం చేయాలనుకున్నా, దైవ సంబంధ పనులు చేయాలన్నా గ్రహణ కాలాలను పరిగణలోకి తీసుకుంటారు. అందుకే గ్రహం ఎప్పుడు, ఎన్ని గంటలకు మొదలవుతుంది. ఎన్ని గంటలకు పూర్తవుతుందో ప్రత్యేకంగా తెలుసుకుంటారు. ఈ సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు, గ్రహణ కాలాలు సంక్లిష్టంగా వచ్చాయి. వాటి గురించి పండితులు, పూజాలను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సంవత్సరంలో చివరి, రెండో చంద్ర గ్రహణం నేడు (సెప్టెంబర్ 18) సంభవించింది. ఈ ఏడాది సూర్య గ్రహణం ఒక్కటే మిగిలి ఉంది. హిందూమతంలో గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దాని ప్రభావం దేశంలో, ప్రపంచంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజున సంభవిస్తుంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున జరుగుతుంది. సూర్యగ్రహణం ఖచ్చితమైన తేదీ, సుతక్ కాలం ఎప్పుడో తెలుసుకుందాం. అయితే దీనిపై పండితులు ఏం చెప్తున్నారు. సూతక్ కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది..? ఎప్పుడు ముగస్తుందో అది భారత్ లో ఎప్పుడు ఉంటుంది తెలుసుకుందాం.
రెండో సూర్యగ్రహణం ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది (2024)లో రెండో సూర్యగ్రహణం అశ్విని మాసం అమావాస్య రోజున ఉంటుంది. అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 3.17 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి సుమారు 6 గంటల 4 నిమిషాలు ఉంటుంది.
సూర్యగ్రహణం కనిపిస్తుందా..?
ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతోంది. అందువల్ల, ఇది భారతదేశంలో కనిపించదు. భారత దేశంతో పాటు బ్రెజిల్, ఆర్కిటిక్, కుక్ ఐలాండ్, ఫిజీ, ఆర్కిటిక్, చిలీ, పెరూ, హోనోలులు, అంటార్కిటికా, అర్జెంటీనా, ఉరుగ్వే, బ్యూనస్ ఎయిర్స్, బీకా ఐలాండ్, మెక్సికో, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది.
సూర్య గ్రహణ సుతక్ కాల సమయం
గ్రహణం ప్రారంభమైనప్పుడు, సుతక్ కాలం కొన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. ఇక్కడ చంద్ర గ్రహణానికి సంబంధించి సుతక్ కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఇది సూర్య గ్రహణం సుతక్ కాలం అనేది గ్రహణం ప్రారంభం అయ్యేందుకు కేవలం 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న ఉదయం 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభం కానుంది. కానీ భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు. అప్పుడు సుతక్ కాలం ఉండదని పండితులు చెప్తున్నారు.
సూర్య గ్రహణం ఎలా చూడాలి
అక్టోబర్ 2, 2024న ఏర్పడే గ్రహణం వార్షిక సూర్యగ్రహణం అని తెలుసుకుందాం. ఎప్పుడూ కంటితో చూడకూడదు. ఫిల్మ్ లేదంటే.. ఎక్స్ రే ఫిల్మ్ లాంటి వాటి నుంచి మాత్రమే చూడాలి. లేదంటే కంటిపై కాంతి ఎక్కువై చూపుపై ఇబ్బంది పడుతుంది.