https://oktelugu.com/

Big Boss Telugu 8: నాగ మణికంఠ కి విడాకులు ఇవ్వమంటూ అతని భార్యని డిమాండ్ చేసిన విష్ణు ప్రియా..వైరల్ గా మారిన వీడియో!

భార్య మీద అంత ప్రేమ ఉన్న వ్యక్తి, జనాల్లో కలవలేకపోతున్నాను అని చెప్పుకొని తిరిగే వ్యక్తి నేడు అవకాశం దొరికినప్పుడల్లా లేడీ కంటెస్టెంట్స్ ని గట్టిగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తున్నాడు. మగవాళ్ళతో ఆయన మళ్ళీ ఇలా ప్రవర్తించడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : September 18, 2024 / 12:06 PM IST

    Big Boss Telugu 8

    Follow us on

    Big Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నాగ మణికంఠ ఈమధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మొదటి వారంలో తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొని ఆడియన్స్ వద్ద ఎంతో సానుభూతి సంపాదించిన మణికంఠ ఇప్పుడు హౌస్ లో లేడీ కంటెస్టెంట్స్ తో ప్రవర్తిస్తున్న తీరుని చూసి ఆశ్చర్యపోతున్నారు. భార్య మీద అంత ప్రేమ ఉన్న వ్యక్తి, జనాల్లో కలవలేకపోతున్నాను అని చెప్పుకొని తిరిగే వ్యక్తి నేడు అవకాశం దొరికినప్పుడల్లా లేడీ కంటెస్టెంట్స్ ని గట్టిగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తున్నాడు. మగవాళ్ళతో ఆయన మళ్ళీ ఇలా ప్రవర్తించడం లేదు. కేవలం ఆడవాళ్లతోనే అలా ప్రవర్తిస్తున్నాడు. ఇది చూసేవాళ్లకు ఇన్ని రోజులు నాగమణికంఠ చెప్పినవి మొత్తం అబద్దాలే, ఆడినవి మొత్తం ఫేక్ నాటకాలే అని అంటున్నారు. నామినేషన్స్ లో యష్మీ తో మణికంఠకు గొడవ జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

    ఇతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది, ఎవరితో అయితే ఆయన క్లోజ్ గా కలిసి తిరుగుతాడో, వాళ్లలో నెగేటివ్స్ వెతికి పట్టుకొని, వాటిని నామినేషన్స్ లో ఉపయోగిస్తాడు. మొదటి వారం విష్ణుప్రియతో అదే చేసాడు. తనలోని నెగటివ్ యాంగిల్స్ ని కనిపెట్టడానికి ఇన్ని రోజులు నాతో స్నేహాన్ని వాడుకొని తిరిగావా?, ఇది చాలా పెద్ద మోసం అంటూ విష్ణు ప్రియా చాలా బాధపడుతుంది. యష్మీ తో కూడా మణికంఠ అదే చేసాడు. దీనికి యష్మీ చాలా బాధపడింది. స్నేహం పేరుతో నన్ను మోసం చేసావు, ఈ హౌస్ లో నువ్వు ఉండడం చాలా డేంజర్ అని నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని రోజులైతే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉంటానో, అన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కాస్త స్పేస్ ఏ అమ్మాయికి అయినా అవసరం. కనీసం ఒక్క రోజు సమయం పడుతుంది. కానీ మణికంఠ యష్మీ దగ్గరకు వెంటనే వెళ్ళిపోయాడు. ఒకసారి కాదు, ఏకంగా మూడు సార్లు ఆమెని కౌగలించుకొని క్షమాపణలు చెప్తాడు. ఒకసారి వెనక్కి వచ్చి గట్టిగా కౌగలించుకొని చెప్పడంతో యష్మీ చాలా ఇబ్బందికి గురి అవుతుంది. బిగ్ బాస్ నా వల్ల కావడం లేదు అని ఏడ్చేస్తుంది.

    ఇక ఆ తర్వాత ప్రేరణ ని కూడా ఇలాగే కౌగలించుకున్నాడు, ఫైర్ బ్రాండ్ సోనియా ని అయితే గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అసలు సందర్భం లేకపోయినా కూడా మణికంఠ వేస్తున్న ఈ వింత వేషాలు చూసేవాళ్లకు చాలా చిరాకుగా అనిపించింది. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి నిఖిల్ క్లాన్ ఉంటున్న రూమ్ లోకి వెళ్లి కిరాక్ సీతకు, విష్ణు ప్రియాకు హగ్గులు ఇస్తాడు. దీనికి విష్ణు ప్రియా నవ్వుతూనే నాగమణికంఠ కి కౌంటర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘కంటెంట్ కోసం మణికంఠ ఊరికే ఇక్కడ ఉన్న అమ్మాయిలకు వచ్చి హగ్గులు ఇస్తున్నాడు. శ్రీ ప్రియా నువ్వు వెంటనే విడాకులు పేపర్స్ ని సిద్ధం చెయ్యి, లేకపోతే ఊరికే మాటికొస్తే అందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడు’ అని అంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.