https://oktelugu.com/

మళ్లీ సర్ ప్రైజ్ చేసిన కేసీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ‘ప్రగతి భవన్’లోకి మంత్రులకు సామాన్యులకు ఎంట్రీ లేదన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. కేసీఆర్ కోరుకుంటే తప్ప అందులోకి ఈగ కూడా చొరబడదు అంటారు. తన సొంత పార్టీ నేతలు, సీనియర్లకు కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా షాకిస్తారని ఇటీవల ఈటల రాజేందర్ ఆరోపించారు కూడా. మంత్రులకు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవంటారు. అయితే ఈ మధ్య కేసీఆర్ ఈ ఒంటరితనాన్ని వీడి ఫాంహౌస్ కు దూరంగా ప్రగతి భవన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2021 / 06:43 PM IST
    Follow us on

    తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ‘ప్రగతి భవన్’లోకి మంత్రులకు సామాన్యులకు ఎంట్రీ లేదన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. కేసీఆర్ కోరుకుంటే తప్ప అందులోకి ఈగ కూడా చొరబడదు అంటారు. తన సొంత పార్టీ నేతలు, సీనియర్లకు కూడా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా షాకిస్తారని ఇటీవల ఈటల రాజేందర్ ఆరోపించారు కూడా. మంత్రులకు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవంటారు.

    అయితే ఈ మధ్య కేసీఆర్ ఈ ఒంటరితనాన్ని వీడి ఫాంహౌస్ కు దూరంగా ప్రగతి భవన్ లోనే ఉంటూ జిల్లాల్లో పర్యటిస్తూ ఆస్పత్రులను విజిట్ చేస్తూ లాక్ డౌన్, కరోనా వేళ హల్ చల్ చేస్తున్నారు. రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు. కేసీఆర్ యాక్టివ్ నెస్ చూసి అందరికీ కొంత షాకింగ్ గా మారింది.

    తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపుపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఈనెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపుపై తేల్చేందుకు ముందస్తుగానే జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ ఆంక్షలను తగ్గించడమా? పెంచడమా? పని కోల్పోతున్న వారికి ఎలాంటి ఉపాధి చూపాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట..

    ఈ క్రమంలోనే తన సహజశైలికి భిన్నంగా మంత్రులకు కేసీఆర్ ఫోన్లు చేస్తుండడం విశేషం. తాజాగా కేసీఆర్ నుంచి మంత్రులు తలసాని, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి, సత్యవతి, పువ్వాడ అజయ్, జగదీశ్ రెడ్డి, గంగుల, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలకు ఫోన్లు చేసి మరీ కేసీఆర్ లాక్ డౌన్ కొనసాగిద్దామా? సడలిద్దామా? పరిస్థితులు ఎలా ఉన్నాయని ముందస్తుగా ఆరాతీశారట.. కేసీఆర్ నుంచి ఇలాంటి ఫోన్ కాల్ ఊహించని వారంతా సర్ ప్రైజ్ అయ్యారట.. అదీ సంగతి.