బ్రహ్మపుత్ర నదికి ఎసరుపెడుతున్న చైనా

ప్రపంచంలోని జలసంపదను దోచుకోవాలని చైనా భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని నదులపై ఆనకట్టలు కడుతూ పొరుగు దేశాలకు నీరు రాకుండా చేయడమే ద్యేయంగా ముందుకు కదులుఃతోంది. అనుకున్నదే తడవుగా బారీ ప్రాజెక్టుల రూపకల్పనకు నడుంబిగించింది. భారత్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులకు పూనుకుంటుందని తెలుస్తోంది. అయినా అంతర్జాతీయంగా దెబ్బతీయలేక ఇలా వ్యవహరించడం అగ్రరాజ్యానికి తగదని చెబుతున్నారు. టిబెట్ లోని యార్లుంగ్ లో బ్రహ్మపుత్ర నదిపై రెండు డ్యాములు నిర్మించాలని డ్రాగన్ పథకం వేసింది. త్రీగోర్జెస్ డ్యామ్ […]

Written By: Srinivas, Updated On : May 28, 2021 6:05 pm
Follow us on

ప్రపంచంలోని జలసంపదను దోచుకోవాలని చైనా భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని నదులపై ఆనకట్టలు కడుతూ పొరుగు దేశాలకు నీరు రాకుండా చేయడమే ద్యేయంగా ముందుకు కదులుఃతోంది. అనుకున్నదే తడవుగా బారీ ప్రాజెక్టుల రూపకల్పనకు నడుంబిగించింది. భారత్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులకు పూనుకుంటుందని తెలుస్తోంది. అయినా అంతర్జాతీయంగా దెబ్బతీయలేక ఇలా వ్యవహరించడం అగ్రరాజ్యానికి తగదని చెబుతున్నారు. టిబెట్ లోని యార్లుంగ్ లో బ్రహ్మపుత్ర నదిపై రెండు డ్యాములు నిర్మించాలని డ్రాగన్ పథకం వేసింది. త్రీగోర్జెస్ డ్యామ్ వద్ద ఉత్పత్తి చేసే జలవిద్యుత్ కన్నా నాలుగు రెట్ల అధిక సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది.

సెడాంగ్ పులో ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయ ఉంది. మంచుదిబ్బలు కరిగిపోతూ ఏర్పడే ప్రవాహాలతో భారీ స్థాయిలో నీరు నిలిచిపోయే పెద్ద కృత్రిమ జలాశయాలు ఏర్పడుతుంటాయి. ఇవి ప్రతిపాదిత యార్లుంగ్ సంగ్పో పై నిర్మించే డ్యాములకు ఎగువన ఉండడం, ఏ క్షణంలోనైనా నీరు ఒక్కసారిగా వచ్చి డ్యాములపై ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇక్కడ ఆనకట్టల నిర్మాణాలకు ఇంజినీర్లు సంశయిస్తున్నారు.

చైనా ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా వివిధ నిపుణుల బృందాలను నియమించింది. సెడాంగ్ పు పరివాహక ప్రాంతపై అధ్యయనం చేయించింది. ఇక్కడ తక్షణ పరిష్కారమేదీ కనిపించడం లేదని షాంఘై జియావో టాంగ్ విశ్వవిద్యాలయ సివిల్ ఇంజినీర్ ప్రొఫెసర్, నిపుణుల బృందంలో ఒకరైన షింగ్ షిగువ్వా తె లిపినట్లు హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది.

పద్నాలుగో పంచవర్ష ప్రణాళిక లో భాగంగా చైనా యార్లుంగ్ సంగ్పో లపై చేపట్టే డ్యాముల వద్ద రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని ప్రతిపాదించింది. మెటాక్, దాదుక్వియా ప్రాంతాల్లో నిర్మించబోయే ఈ ప్రాజె క్టులు భారత సరిహద్దులకు సమీపంలోనే ఉన్నాయి. దీంతో చైనా ప్రతిపాదించిన రెండు ఆనకట్టలు కూడా అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైనవే. నది దిగువ భాగంలో ఉన్న భారత్, బంగ్లా నీటి హక్కులకు భంగం కలిగించేవే.