రామోజీ మెడకు మళ్లీ ‘మార్గదర్శి’ ఉచ్చు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మెడకు మరోసారి ‘మార్గదర్శి’ ఉచ్చు పడింది. ఈ ఫైనాన్షియల్ సంస్థలో అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో హైకోర్టులో చాకచక్యంగా విచారణ కొట్టివేయబడింది. కానీ ఇప్పుడు మార్గదర్శి అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. Also Read: ‘ఈనాడు’తో లాభం లేదనుకుంటున్న రామోజీ? నిజానికి ఈ కేసు నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి వేయించిన […]

Written By: NARESH, Updated On : August 10, 2020 6:08 pm
Follow us on


ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మెడకు మరోసారి ‘మార్గదర్శి’ ఉచ్చు పడింది. ఈ ఫైనాన్షియల్ సంస్థలో అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో హైకోర్టులో చాకచక్యంగా విచారణ కొట్టివేయబడింది. కానీ ఇప్పుడు మార్గదర్శి అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

Also Read: ‘ఈనాడు’తో లాభం లేదనుకుంటున్న రామోజీ?

నిజానికి ఈ కేసు నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి వేయించిన కేసు. ఆ కేసులో ఆ తర్వాత హైకోర్టులో రామోజీరావు కొట్టివేసేలా చేసుకున్నారు. ఈ కథ ఇక్కడితో ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉండవల్లి మరోసారి అనూహ్యంగా తిరగదోడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అక్కడ సీఎం జగన్, ఇక్కడ కేసీఆర్ లు ఈనాడు సంస్థపై, అధినేత రామోజీరావు రాతలపై ఆగ్రహంగా ఉన్న వేళ ఈ కేసులు మళ్లీ మొదటికి రావడం రాజకీయంగా వేడెక్కించింది.

వైఎస్ఆర్ హయాంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి మార్గదర్శి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసును అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సవాల్ చేస్తూ సుప్రీంను తాజాా ఆశ్రయించారు.తాజాగా మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్ చేసేందుకు అనుమతినిచ్చింది.

గతంలో ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ( ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పును ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి.. తాజాగా కోర్టును ఆశ్రయుంచారు. 266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.

Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

ఈ రోజు రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజు కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే రామోజీపై కొద్దికాలంగా ఎక్కడ దొరుకుతాడని భావిస్తున్న ఏపీ సీఎం జగన్ ఇందులో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు అని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇక కేసీఆర్ కూడా నజర్ పెడితే ఈ కేసులో మరిన్ని చిక్కులు రామోజీకి తప్పవని అంటున్నారు. మొత్తంగా హైకోర్టులో సమసిపోయిన ‘మార్గదర్శి’ కేసు సుప్రీంలో మరోసారి విచారణకు రావడం రామోజీకి గుదిబండగా మారింది.