https://oktelugu.com/

‘జగన్ గారూ… మనం వరస్ట్?’ అటగా..!

కరోనా వైరస్‌ ను కట్టడి చేయడంలో ఏపీ రాష్ట్రం వరస్ట్ అంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల తీరు చూస్తుంటే త్వరలోనే భారత్‌ ను కరోనా కేసుల్లో మొదటి స్థానానికి చేర్చే అవకాశం ఉన్నట్టుగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఏపీలోనే కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని.. ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆ ఆంగ్ల పత్రిక తన తాజా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 10, 2020 / 06:37 PM IST
    Follow us on

    కరోనా వైరస్‌ ను కట్టడి చేయడంలో ఏపీ రాష్ట్రం వరస్ట్ అంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల తీరు చూస్తుంటే త్వరలోనే భారత్‌ ను కరోనా కేసుల్లో మొదటి స్థానానికి చేర్చే అవకాశం ఉన్నట్టుగా ఉందని పేర్కొంది.

    అంతేకాకుండా, అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఏపీలోనే కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని.. ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆ ఆంగ్ల పత్రిక తన తాజా ప్రత్యేక కథనంలో పేర్కొంది.

    పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు ప్రముఖ ఆంగ్ల పత్రిక మూడో ర్యాంకు ఇచ్చిందంటూ ఆయన సొంత పత్రిక పతాక శీర్షికన ప్రచురించింది. కానీ కరోనా విషయానికి వస్తే రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉందని.. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ గా మారుతుందని.. ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారతదేశాన్ని.. ప్రథమ స్థానానికి తీసుకెళ్తుందని అదే ఆంగ్ల పత్రిక పేర్కొంది.

    కరోనా విషయంలో తొలుత రాష్ట్రం స్థానికం నుంచి జాతీయ స్థాయికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందని తెలిపింది. కట్టడి జోన్లను ప్రకటించినా.. అక్కడ వైరస్‌ నియంత్రణ చర్యలు లేవు. ప్రతి ఒక్కరినీ పరీక్షించకపోవడం .. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని నిలువరించి ప్రత్యేక పరీక్షలు చేపట్టకపోవడమూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రతను పెంచేసిందని వివరించింది.