అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్: సుప్రీం సంచలన నిర్ణయం

ఎంత ప్రయత్నించినా ఏపీ సీఎం జగన్ ప్రతీకార వాంచ మాత్రం తీరడం లేదు. చంద్రబాబును ఒక్క కుంభకోణంలో అయినా ఇరికించాలన్న జగన్ తాపత్రయం నెరవేరడం లేదు. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అక్రమాలు జరిగాయని జగన్ నిగ్గు తేల్చినా కోర్టుల్లో ఆ వాదన నెగ్గడం లేదు. దీంతో జగన్ ఆశలు అడియాశలవుతున్నాయి. అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఫైట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి […]

Written By: NARESH, Updated On : July 19, 2021 5:46 pm
Follow us on

ఎంత ప్రయత్నించినా ఏపీ సీఎం జగన్ ప్రతీకార వాంచ మాత్రం తీరడం లేదు. చంద్రబాబును ఒక్క కుంభకోణంలో అయినా ఇరికించాలన్న జగన్ తాపత్రయం నెరవేరడం లేదు. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అక్రమాలు జరిగాయని జగన్ నిగ్గు తేల్చినా కోర్టుల్లో ఆ వాదన నెగ్గడం లేదు. దీంతో జగన్ ఆశలు అడియాశలవుతున్నాయి.

అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఫైట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా అమలు చేసింది.

అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.ఈ అంశంపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

గతంలోనే ఏపీ హైకోర్టు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అక్రమాలు జరగలేదని కొట్టివేసింది. ఆ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా..తాజాగా సుప్రీం కోర్టు సైతం సుధీర్ఘ విచారణ అనంతరం కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం తరుఫున దుష్యంత్ దవే, మెహపూజ్ నజ్కి ఎంత గట్టిగా వాదించినా నెగ్గలేదు. దీంతో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది.