లాయర్ క్రిమినల్ బుద్ధి: తల్లితో వివాహేతర సంబంధం.. ఆపై కూతురిపై కన్ను

ఆయనో న్యాయవాది. న్యాయం కోసం కోర్టులో పోరాడాల్సిన వ్యక్తి. కంచే చేను మేస్తే అన్న చందంగా ఆయనే తప్పుదారి పట్టాడు. పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను అనుభవించిందే కాక ఆమె కూతురిపైనా కన్నేశాడు కామాంధుడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కటాకటాలపాలయ్యాడు. సదరు లాయర్ బీజేపీ నాయకుడు కావడంతో ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఇలా అడ్డదారులు తొక్కుతున్నాడని తెలుస్తోంది. దీనిపై మహిళ సిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లీ కూతుళ్లపై […]

Written By: Srinivas, Updated On : July 19, 2021 5:43 pm
Follow us on

ఆయనో న్యాయవాది. న్యాయం కోసం కోర్టులో పోరాడాల్సిన వ్యక్తి. కంచే చేను మేస్తే అన్న చందంగా ఆయనే తప్పుదారి పట్టాడు. పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను అనుభవించిందే కాక ఆమె కూతురిపైనా కన్నేశాడు కామాంధుడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కటాకటాలపాలయ్యాడు. సదరు లాయర్ బీజేపీ నాయకుడు కావడంతో ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఇలా అడ్డదారులు తొక్కుతున్నాడని తెలుస్తోంది. దీనిపై మహిళ సిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లీ కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు నమోదు కావడంతో న్యాయవాది పరారయ్యాడు.

చెన్నైలోని ఎదుక్కాంచేరిలో పార్థసారది (55) అనే క్రిమినల్ లాయర్ నివాసం ఉంటున్నాడు. బీజేపీ విభాగం బార్ అసోసియేషన్ పెరంబూర్ పార్టీ లీడర్ గా కూడా పని చేస్తున్న పార్థసారధి పలుకుబడి బాగానే ఉందని సమాచారం. బీజేపీలో చురుకుగా పాల్గొంటున్న అతడు లాయర్ కావడంతో ఆయనకు పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతోనే ఆయన తన ఇంటి ముందు ఉంటున్న ఓ వివాహితపై కన్ను వేశాడు. లోబరుచుకుని తన కోర్కెలు తీర్చుకున్నాడు.

అయితే సదరు చిత్రను శారీరకంగా బాగానే వశపరుచుకున్నాడు. చిత్రకు 15 సంవత్సరాల కూతురు ఉంది. దీంతో అతడి కన్ను ఆమె కూతురుపై పడింది. కూతురును కూడా తన వశం చేసుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఆమె కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 2018లో చిత్ర తనను పార్థసారధి లైంగికంగా హింసించాడని కేసు పెట్టింది. దీంతో అతడిని కొండుగైయూరు పోలీసులు పార్థసారధిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

చిత్ర కేసు పెట్టి జైలుకు పంపించిన కొంతకాలానికి లాయర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆపై తనపై మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తాను పెట్టిన కేసువెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని చిత్ర చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తనను, తన కూతురిని ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడని ఆరోపించింది. కేసు వెనక్కి తీసుకోవాలని తనను పార్థసారధి కారు డ్రైవర్ బెదిరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించారు.

చిత్రతోపాటు ఆమె 15 ఏళ్ల కుమార్తె కూడ తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో చెన్నై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో క్రిమినల్ లాయర్ పార్థసారధి పరారయ్యాడు. పార్థసారధి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం కలకలం రేపింది. పార్థసారధి కోసం గాలిస్తున్నామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు.