
టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వివిధ ఉద్యోగ నియామకాల ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్ పొరపాట్లపై విచారణ సోమవారం జరిగింది. బబ్లింగ్ లో తప్పులు ఉన్న సమాధాన పత్రాలను అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది. బబ్లింగ్ లో తప్పులు చేసిన వారి ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం అక్కర్లేదని స్పష్టంచేసింది. వివరాలను జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యతా అభ్యర్థులేదేనని తేల్చి చెప్పింది. కోర్టు కేసులతో ఆగిన నియామకాలు చేపట్టాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది.