https://oktelugu.com/

కమలంలో ఆధిపత్య పోరు మొదలైందా?

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని వినియోగించుకుంటూ తెలంగాణలో మరింత బలపడేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించింది. సంజయ్ నియామకం తర్వాత బీజేపీలో మరింత జోష్ పెరిగింది. అధికార పార్టీలో బీజేపీ నేతలు దూకుడుగా వెళుతూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయం అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. Also Read: ‘బండి’ టార్గెట్ గా […]

Written By:
  • admin
  • , Updated On : August 8, 2020 / 05:35 PM IST
    Follow us on


    తెలంగాణలో బీజేపీ బలపడేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని వినియోగించుకుంటూ తెలంగాణలో మరింత బలపడేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించింది. సంజయ్ నియామకం తర్వాత బీజేపీలో మరింత జోష్ పెరిగింది. అధికార పార్టీలో బీజేపీ నేతలు దూకుడుగా వెళుతూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయం అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

    Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

    ఇదిలా ఉంటే కొన్ని జిల్లాలో బీజేపీలో ఆధిపత్య పోరు మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అధిష్టానం వాటిపై దృష్టాసారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆధిపత్య పోరు తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగానే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం, దాని అనుబంధ కమిటీల్లో ఆదిలాబాద్ కు పెద్దగా చోటు కల్పించలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిలాబాద్ నేతలు బీజేపీ అధిష్టానం దగ్గరే పంచాయితీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ కిందిస్థాయి నాయకత్వంలోనూ ఎవరికీవారు గ్రూపు రాజకీయాలకు పెద్దపీఠ వేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యనిర్వాహాక సభ్యురాలు చిట్యాల సుహసిన మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా వ్యహరించిన సుహసిని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారనే టాక్ ఉంది. అయితే ఆ సీటు పాయం శంకర్ కు బీజేపీ కేటాయించింది. అయినప్పటికీ సుహాసిని ఎలాంటి బేషజాలకు పోకుండా పాయం శంకర్ గెలుపు కోసం కృషి చేసింది. అయితే ఆ ఎన్నికల్లో పాయం శంకర్ ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సోయం బాబురావు గెలుపు కోసం ఎంతో పని చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున సోయం బాబురావు గెలిచారు.

    Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

    ప్రస్తుతం ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ఉండటంతో పాయం శంకర్, సుహాసిని మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. సుహాసిని తన కంటూ ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి జిల్లా సమస్యలపై వివరించారనే ప్రచారం జరుగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే పార్టీపరంగా దూకుడుగా సుహసిని వ్యవహరిస్తున్నారు. అయితే పాయం శంకర్, సుహసిని మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నప్పటికీ ఎవరు కూడా బయట పడకుండా సొంతంగా తమ వర్గాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరిలో ఎవరూ పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే..!