https://oktelugu.com/

రాజకీయాల్లో రేణుక ప్రస్థానం ముగిసినట్లేనా?

తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ఫైర్ బ్రాండ్ గా రేణుక చౌదరి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ మాజీ ఎంపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తాచాటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆమె మాటకు తిరుగులేకుండా పోయింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేకపోవడం.. కిందటి లోక్ సభ ఎన్నికల్లో రేణుక అత్యంత దారుణంగా ఓటమి పాలవడంతో ఆమె […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2020 / 05:54 PM IST
    Follow us on


    తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ఫైర్ బ్రాండ్ గా రేణుక చౌదరి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ మాజీ ఎంపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తాచాటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆమె మాటకు తిరుగులేకుండా పోయింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేకపోవడం.. కిందటి లోక్ సభ ఎన్నికల్లో రేణుక అత్యంత దారుణంగా ఓటమి పాలవడంతో ఆమె ఒక్కసారిగా సైలంటైపోయారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రేణుక ఏడాదిగా మౌనవ్రతంలో ఉండటంతో రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ముగిసినట్లేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

    Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

    రేణుక చౌదరి తొలి నుంచి రాజకీయాల్లో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. 1999, 2004లో ఖ‌మ్మం నుంచి వ‌రుస‌గా లోక్‌స‌భ‌కు ఎంపికైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైన కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటుందని భావించినప్పటికీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలిసి పోటీచేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    రేణుక చౌదరి కాంగ్రెస్-టీడీపీ కూటమిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అయిష్టంగానే ఆమె ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రేణుక చౌదరి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుపై దారుణంగా ఓటమి చెందారు. 1.65లక్షల ఓట్ల తేడాతో ఆమె పరాజయం పాలవడంతో నాటి నుంచి ఆమె సైలంటయ్యారు. అయితే రేణుక చౌదరిని ఎన్నిసార్లు గెలిపించిన ఆమె ఖమ్మం ప్రజలను పట్టించుకోకపోవడం.. జిల్లాలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ మిగిలిన వారిని వ్యతిరేకించడమే ఆమె ఓటమి ప్రధాన కారణమనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు ఆమె భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలతో ఎప్పుడు ఆధిపత్య పోరుకు తెరతీసేదంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇక సొంత పార్టీ నేతలపై ఆరోపణలు గుప్పించడం రేణుకకు అలవాటు మారిందనే టాక్ ఉంది.

    కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంలో నేడు చెప్పుకోవడానికి క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ నేతలు కూడా లేని దుస్థితిలోకి వెళ్లింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. గత ఎంపీ ఎన్నికల్లో రేణుక ఓటమి చెందినప్పటి నుంచి కాంగ్రెస్ లో ఎక్కడా యాక్టివ్ గా కన్పించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆమె రాజ్యస‌భ స‌భ్యత్వం కూడా పూర్తయింది.

    Also Read: కమలంలో ఆధిపత్య పోరు మొదలైందా?

    జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమెకు మరోసారి రెన్యూవల్ చేసే పరిస్థితులు కన్పించడం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్-టీడీపీ రాజకీయాల్లో పైచేయి సాధించిన రేణుక ప్రస్తుతం సైలంటడంతో ఆమె రాజకీయాలకు దూరం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కనీసం సొంత పార్టీ నేతలపై రేణుక చౌదరి క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే..!