Homeఆంధ్రప్రదేశ్‌Public Pulse YCP : రాయలసీమలో తగ్గేదేలే.. పబ్లిక్ పల్స్ ను బయటపెట్టిన వైసిపి

Public Pulse YCP : రాయలసీమలో తగ్గేదేలే.. పబ్లిక్ పల్స్ ను బయటపెట్టిన వైసిపి

Public Pulse YCP : వైసీపీకి రాయలసీమలో గట్టి పట్టు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ ప్రాంతం వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో సైతం రాయలసీమలో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. రాయలసీమతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేసింది. కానీ కోస్తాంధ్ర, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 2019లో మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లో వైసిపి స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. రాయలసీమలో అయితే దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. 52 నియోజకవర్గాలకు గాను.. 49 స్థానాల్లో గెలుపొందింది. టిడిపి కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే ఈసారి రాయలసీమ మూడ్ మారినట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిద్ధం సభ సక్సెస్ కావడంతో వైసిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది.

గత కొద్దిరోజులుగా రాయలసీమలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. అటు కీలక నేతల సైతం పార్టీని వీడుతున్నారు. జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో.. సీట్లు దక్కని వారు ప్రత్యర్థులతో చేతులు కదుపుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో రాయలసీమలో వైసిపి గ్రాఫ్ తగ్గుతోందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. వైఎస్ కుటుంబంలో చీలిక,షర్మిలకు పార్టీ పగ్గాలు వంటివి రాయలసీమలో ప్రతికూలతలు చూపుతాయని అంచనాలు ఉన్నాయి. కానీ ఈ అంచనాలను, అనుమానాలను సిద్ధం సభ పటాపంచలు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాప్తాడు సభ సక్సెస్ అయ్యిందా? చేశారా? అన్నది తెలియడం లేదు కానీ లక్షలాదిగా జనాలు తరలి రావడం విశేషం. అటు సోషల్ మీడియాలోనూ సైతం రాప్తాడు సభ భారీగా ట్రెండింగ్ అవుతోంది. ఈ సభలో జగన్ ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. తనకు బలం లేదని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని.. అదే నిజమైతే ఆయన ఇతర పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. జగన్ అటు ఇటు తిరుగుతూ చేసిన ప్రసంగం వైసీపీ శ్రేణులను విశేషంగా ఆకర్షించింది. మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు.

అయితే ఈ సభతో వైసిపి ఇతర పార్టీలకు గట్టి హెచ్చరికను పంపింది. ఏపీలో తమ గ్రాఫ్ తగ్గలేదని.. ప్రజలు వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలు పంపడంలో సక్సెస్ అయ్యింది. దాదాపు పది లక్షల మంది జనాలు వచ్చారని వైసిపి అనుకూల మీడియా చెబుతుండగా.. రెండు లక్షలకు మించి రాలేదని టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. దాదాపు 3,000 ఆర్టిసి బస్సు ఏర్పాటు చేసి.. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి జనాలను తరలించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సిద్ధం సభ ట్రెండింగ్ గా నిలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version