https://oktelugu.com/

Tips: ప్రేమించిన వారిని మర్చిపోలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి

ప్రేమను ఎన్ని విధాలుగా తెలియజేయాలన్నా కష్టమే. నిజమైన ప్రేమను ఈ రోజుల్లో పొందడం, తెలుసుకోవడం రెండు కష్టమే. అట్రాక్షన్ అనే మాటకు ఏం చెప్పాలో తెలియక చాలా మంది ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 19, 2024 5:36 pm
    Tips to forget someone you loved
    Follow us on

    Tips: ప్రేమ ఎంత మధురమో చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి అయినా ఎక్కడ అయినా ఎప్పుడు అయినా ఎలా అయినా పుడుతుంది ప్రేమ. కులమతబేధాలు లేకుండా పుడుతుంది ఈ ప్రేమ. ప్రేమ గురించి కవులు ఎన్ని విధాలుగా చెప్పినా ఇంకా తెలియని ఒక నిర్వచనంగానే ఉండిపోయింది ఈ ప్రేమ. కొందరు చాలా ప్రేమించి చాలా త్వరగానే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతారు. మరి వారు కోలుకోవడం చాలా కష్టం. మరి కోలుకోవాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా. అయితే ఒకసారి ఇది చదివేయండి.

    ఈ ప్రేమను ఎన్ని విధాలుగా తెలియజేయాలన్నా కష్టమే. నిజమైన ప్రేమను ఈ రోజుల్లో పొందడం, తెలుసుకోవడం రెండు కష్టమే. అట్రాక్షన్ అనే మాటకు ఏం చెప్పాలో తెలియక చాలా మంది ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు. ఇలాంటి ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు అనేది తెలిసిందే. రెండు మనసులు కలిస్తే ప్రేమ. ఆ ప్రేమను కాపాడుకోవడానికి ఒక జీవితం కూడా సరిపోదు. అలాంటి ప్రేమను పొందడం చాలా కష్టమే.

    ఒకసారి ప్రేమిస్తే ఆ ప్రేమను విడిచిపెట్టాలి అంటే ప్రాణం పోవాల్సిందే అనేట్టుగా ప్రేమిస్తారు కొందరు. అయితే ఈ ప్రేమ పొందడం ఎంత కష్టమో.. దాన్ని మర్చిపోవడం కూడా అంతేకష్టం. మరి మీరు ఇలానే ప్రేమిస్తున్నారా? ప్రేమించిన వారికి దూరం అయ్యారా? వారిని మర్చిపోలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి కాస్తైన ఉపశమనం పొందుతారు.

    ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమ విఫలమైనప్పుడు లేక దూరమైనప్పుడు కలిగే బాధను తట్టుకోవడం అంత సులువు కాదు. ఆ పరిస్థితి నుంచి కోలుకునేందుకు మానసిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ బ్రేకప్ జ్ఞాపకాన్ని మరిచిపోతాను అని మనసులో బలంగా అనుకోవాలి. సన్నిహితులతో కచ్చితంగా బాధను పంచుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. వ్యాయామం, ఉద్యోగం, చదువు వంటి ఇతర పనులపై దృష్టి పెట్టాలి.