Super Woman
Super Woman : చాలా మంది గొప్ప గొప్ప ఆడవాళ్ల కథలను మనం వినే ఉంటాం. వారి ఓపికకు హ్యాట్సాఫ్ చెప్పా్ల్సిందే. ఇంటిని, ఆఫీసును ఒకేసారి నిర్వహించే చాలా మంది మహిళలు ప్రస్తుతం మన మధ్య ఉన్నారు. కానీ మలేషియా నివాసి అయిన రాచెల్ కౌర్ కథ తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్, ప్రతిరోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి 700 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రి ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె తన పిల్లలతో సమయం గడపడానికి, వారి చదువులో సహాయం చేయడానికి మాత్రమే ఇలా చేస్తోంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఈ సూపర్ ఉమెన్ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందనే ప్రశ్న మనసులో తలెత్తడం సహజం. అప్పుడు ఆమె ఎంత సంపాదిస్తుంది? దీని వెనుక ఉన్న మొత్తం కథను ఈ రోజు తెలుసుకుందాం.
యూట్యూబ్ ఛానల్ సీఎన్ఏ ఇన్సైడర్ ఈ మహిళ మొత్తం ఒకరోజు ప్రయాణాన్ని కవర్ చేసింది. దీనిలో ఆ మహిళ ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి మలేషియాలోని పెనాంగ్ నగరం నుండి కౌలాలంపూర్‌కు వెళ్లడానికి తన పోరాటాన్ని ప్రారంభిస్తుందని వెల్లడైంది. కౌలాలంపూర్‌లో ఉండటం కంటే ప్రతిరోజూ విమానంలో పైకి క్రిందికి ప్రయాణించడం తనకు చౌకగా ఉంటుందని రేచెల్ చెప్పింది. ఆమె ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ముందే ఆఫీసుకు చేరుకుంటుందని చెప్పింది.
రాచెల్ కౌర్ తన ఇంటి నుండి ఉదయం 5 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతానని చెప్పింది. “సాధారణంగా నేను ఉదయం 4 గంటలకు, 4:10 గంటలకు, 4:15 గంటలకు నిద్రలేచి, స్నానం చేసి, బట్టలు వేసుకుని ఉదయం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరుతాను. తరువాత నేను నెమ్మదిగా విమానాశ్రయానికి చేరుకుంటాను. బోర్డింగ్ ఉదయం 5:55 కి కాబట్టి నా కారు పార్క్ చేయడానికి, బూట్లు ధరించడానికి, అక్కడ నడవడానికి, విమానం ఎక్కేందుకు, చెక్ ఇన్ చేయడానికి నాకు చాలా సమయం ఉంటుంది. అప్పుడు విమానం సాధారణంగా అరగంట నుండి 40 నిమిషాల వరకు పడుతుంది. ఆ తరువాత నేను ఉదయం 7:45 కి ముందే ఆఫీసుకు చేరుకుంటాను.” అని చెప్పుకొచ్చింది.
ప్రారంభంలో రాచెల్ కౌలాలంపూర్‌లోని తన కుటుంబానికి దూరంగా పెనాంగ్‌లో నివసించాలని నిర్ణయించుకుంది. కానీ అది ఆమెకు చాలా ఖరీదైనదిగా అనిపించింది. ఆమె శని, ఆదివారాల్లో మాత్రమే వారాంతాల్లో తన కుటుంబంతో సమయం గడపగలిగింది. చివరకు తను తన పిల్లల మంచి భవిష్యత్తు కోసం కౌలాలంపూర్ నుండి రోజూ ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. నేను అక్కడ అద్దెకు నివసిస్తున్నప్పుడు, నెలకు సగటు ఖర్చు 474 అమెరికా డాలర్లు అని రాచెల్ కౌర్ చెప్పుకొచ్చింది.
రాచెల్ తన రోజువారీ విమాన ప్రయాణానికి కేవలం 316డాలర్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పింది. విమానాశ్రయం నుండి నా ఆఫీసుకి నడవడానికి నాకు 5 నుండి 7 నిమిషాలు మాత్రమే పడుతుంది, ఇది కవలాలంపూర్‌లో ట్రాఫిక్ జామ్‌ను నివారిస్తుంది. ఆమె ఎయిర్ ఆసియా ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తుంది. ఆమె రోజువారీ విమానాల కోసం తన జేబులోంచి డబ్బు ఖర్చు చేస్తుంది. అయితే, ఉద్యోగిగా ఉండటం వల్ల ఎయిర్ ఆసియా నుండి భారీ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. దానిలో ఆమె కూడా పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ ఏర్పాటు సహాయంతో నేను ప్రతిరోజూ నా పిల్లల ఇంటికి చేరుకోగలుగుతున్నానని రేచెల్ చెప్పింది. నేను ప్రతి రాత్రి నా పిల్లలను కలుస్తాను. ఇది మాత్రమే కాదు, నేను వారి హోం వర్క్ లో కూడా సహాయం చేయగలనని చెప్పుకొచ్చింది.