Allu Arjun , Trivikram
Allu Arjun and Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా మారే అవకాశాలను అందుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్లతో పాటుగా దర్శకులు సైతం తమదైన రీతిలో సినిమాలు చేసి గొప్ప గుర్తింపును చాటుకోవడమే కాకుండా తమ రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచాలనే ప్రయత్నంలో ఉన్నారు… మొత్తానికైతే త్రివిక్రమ్ (Trivikram) లాంటి స్టార్ డైరెక్టర్ తనను తాను మరోసారి గొప్ప డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. తన తోటి దర్శకులు అందరూ పాన్ ఇండియాలో సత్తా చాటుతూ ముందుకు సాగుతూ ఉంటే ఈయన మాత్రం తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైపోయాడు. కారణం ఏదైనా కూడా ఆయన ఇకమీదట పాన్ ఇండియా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా ఫైనల్ అయినప్పటికి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నాగ వంశీ, చినబాబు వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఈ సినిమా అని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని చూస్తున్నాడు… కారణం ఏంటి అంటే ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో భారీ వసూళ్లను రాబట్టిన అల్లు అర్జున్ తన తర్వాత సినిమాకి భారీ హైప్ అయితే ఉంటుంది.
కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి బీభత్సమైన కలెక్షన్స్ ని రాబడుతుందనే ఉద్దేశ్యం తో అల్లు అరవింద్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతానని త్రివిక్రమ్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే త్రివిక్రమ్ కి హోం బ్యానర్ లాంటిది. అలాగే చినబాబు హారిక హాసిని క్రియేషన్స్ కూడా ఇందులో భాగం అవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి మూడు బ్యానర్స్ తో కలిసి త్రివిక్రమ్ సినిమా చేస్తాడా లేదంటే హారిక హాసిని క్రియేషన్స్ లోనే సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే త్రివిక్రమ్ మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి సినిమా పాన్ ఇండియాలో ఇంతవరకు రానటువంటి ఒక కొత్త సబ్జెక్టుతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక త్రివిక్రమ్ స్వతహాగా రైటర్ కాబట్టి ఒక మంచి కథను అయితే రాసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన కథలు ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి. బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఉంటాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే…