Phone Tapping Case
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping case) లో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అవయవాలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు (Prabhakar Rao), శ్రవణ్ రావు (Sravan Rao) ను భారతదేశానికి రప్పించడానికి లైన్ క్లియర్ అయింది. వీరిద్దరిపై ఇంటర్ పోల్ సంస్థ రెడ్ కార్నర్ నోటీసులు (Red corner notice) జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్ పోల్ సంస్థ రెడ్ కార్నర్ నోటీసులపై సిబిఐ కి సమాచారం అందించింది. సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడి అధికారులకు సమాచారం అందింది. సాధ్యమైనంత తొందరలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని భారతదేశానికి రప్పించడానికి కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. డిహెచ్ఎస్ కు వర్తమానం అందగానే అమెరికాలోని ప్రొవిజినల్ అరెస్ట్ (ఇది తాత్కాలికమైనది) చేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో తల దాచుకున్న నిందితులను డిపో స్టేషన్ ప్రక్రియ ద్వారా భారతదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత సిబిఐ వారిని అదుపులోకి తీసుకుంటుంది. కేసు తీవ్రత ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. వారికే సిబిఐ అధికారులు అప్పగించే అవకాశం ఉంది.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రి పీఏ అరెస్ట్.. బీఆర్‌ఎస్‌కు కీలక నేతకు సాక్!
పంజాగుట్టలో కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫిర్యాదు ముందుగా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదయింది. ఆ తర్వాత కొంతమంది అధికారులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో విశ్రాంత అధికారులు కూడా ఉన్నారు. వారిని సుదీర్ఘకాలం జ్యుడీషియల్ ఖైదీలుగా పోలీసులు ఉంచారు. అమ్మదైన దర్యాప్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే నిందితులు అమెరికా పారిపోయారు. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ ఓ ఎస్ డి ప్రభాకర్ రావు ఉన్నారు. ఇక ఈ వ్యవహారంలో అరువెళ్ళ శ్రవణ్ రావు కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈయన ఓ న్యూస్ ఛానల్ ఓనర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇతరిపై కూడా ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్ పోల్) నుంచి సిబిఐకి సమాచారం అందింది. సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడీకి వర్తమానం వచ్చింది. వీరుని త్వరగా తీసుకొచ్చే విషయంపై కేంద్ర హోమ్ శాఖ, విదేశాంగ శాఖ ద్వారా హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.. అయితే రెడ్ కార్నర్ నోటీస్ అంశానికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కి సమాచారం అందితే.. వారిద్దరిని అమెరికాలోనే తాత్కాలిక అరెస్టు చేసి.. డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రొవిజినల్ అరెస్టును ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అక్కడి న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉంది. నిందితుల పిటిషన్ ను అక్కడ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడి న్యాయస్థానంలో వారికి ఊరట లభించకపోతే డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు వచ్చే అవకాశం ఉంది.. దానికోసమే తెలంగాణ సిఐడి శాఖ ఎదురుచూస్తోంది. అమెరికా కోర్టులో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావులకు ఊరట లభించకూడదని కోరుకుంటున్నది. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి జై శంకర్ ను కలిసిన కొద్ది రోజులకే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు.. పది నెలల తర్వాత తొలి బెయిల్.. !