Sudha Murthy : వేల కోట్ల డబ్బున్నా గత 30 ఏళ్లలో ఒక్క చీర కొనుగోలు చేయలేదు..

Sudha Murthy నారాయణమూర్తి, సుధ దంపతులకు అక్షిత, రోహన్ అనే పిల్లలున్నారు. అక్షిత బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ను వివాహం చేసుకున్నారు. ఇక రోహన్ టీవీఎస్ ఎండీ వేణు శ్రీనివాసన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు.

Written By: NARESH, Updated On : July 6, 2024 4:21 pm

Sudha Murthy of Infosys who has not bought a single saree in the last 30 years

Follow us on

Sudha Murthy :  దేశంలో ఐటీ రంగం మొదలుకాకముందే ఆమె తన భర్తతో ఇన్ఫోసిస్ అనే కంపెనీ స్థాపించారు సుధా మూర్తి. దానిని తన మానస పుత్రికగా అభివృద్ధి చేసి అంచలంచెలుగా విస్తరించారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నారు.. ఐటి నుంచి అనేక రంగాలకు ఎదిగి.. దేశంలోనే అత్యున్నత ఐటీ సంస్థగా దానిని అభివృద్ధి చేశారు.. ఈ క్రమంలో ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు.. రాజ్యసభ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల రాజ్యసభలో ఆమె మాట్లాడిన మాటలు అందర్నీ ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ఆమె చేసిన సూచనలు చాలామందిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు.

ముందుగానే చెప్పినట్టు వెలకట్టలేని సంపద ఉన్నప్పటికీ సుధా మూర్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపం లా ఉంటారు. వితరణ శీలిగా ఆమె పేరు పొందారు. అయితే అలాంటి సుధా మూర్తి గత 30 సంవత్సరాలలో ఒక చీర కూడా కొనుగోలు చేయలేదట. కాశి యాత్ర వల్లే తాను చీరలు కొనుగోలు చేయలేదని కుండబద్దలు కొట్టారు. “కాశి క్షేత్రంలో పుణ్య స్నానం చేసిన తర్వాత మనకు ఇష్టమైన వాటిని వదిలేయాలంటారు. అలా నేను నాకు ఇష్టమైన షాపింగ్ ను గంగా నదిలో వదిలేసా. అందువల్లే నేను చీరల ను కొనుగోలు చేయడం లేదు. ముఖ్యమైన వస్తువులు అయితేనే కొనుగోలు చేస్తా. 30 సంవత్సరాల లో ఒక చీర కూడా కొనుగోలు చేయలేదు కాబట్టి ఉన్న వాటినే మళ్లీమళ్లీ ఉపయోగిస్తున్నా. మా కుటుంబ సభ్యులు అత్యంత పొదుపుగా జీవించారు. వారి నుంచే నాకు ఈ అలవాట్లు అలవడ్డాయి.. అప్పట్లో మా అమ్మ కబోర్డులో కేవలం పది చీరలు మాత్రమే ఉండేవి. మా నానమ్మ దగ్గర నాలుగు మాత్రమే ఉండేవి. నేను కూడా వారిలాగే పొదుపుగా జీవిస్తున్నాని” సుధా మూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

“ఇన్ని సంవత్సరాలలో నేను చీరలు కొనుగోలు చేయనప్పటికీ.. నా పరిస్థితి అర్థం చేసుకొని సోదరీమణులే చీరలు పంపుతుంటారు. అప్పుడప్పుడు నా స్నేహితులు కూడా బహుమతులుగా అందిస్తుంటారు. షాపింగ్ వదిలేసిన తర్వాత ప్రతి సంవత్సరం నా సోదరీమణులు నాకు అనేక చీరలు పెట్టేవారు. అయితే అలా పెట్టొద్దని నేను వారికి సూచించా. నేను గత 50 సంవత్సరాలుగా చీరలే కడుతున్నా. అందులో నాకు అత్యంత సౌకర్యంగా ఉంటుందని” సుధా మూర్తి పేర్కొన్నారు. నారాయణమూర్తి, సుధ దంపతులకు అక్షిత, రోహన్ అనే పిల్లలున్నారు. అక్షిత బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ను వివాహం చేసుకున్నారు. ఇక రోహన్ టీవీఎస్ ఎండీ వేణు శ్రీనివాసన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు.