HDFC Bank
HDFC: ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. కొన్ని పనుల నిమిత్తం జూలై 13వ తేదీన బ్యాంకు కు సంబంధించిన UPI లావాదేవీల్లో అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ బ్యాంకు ఖాతాదారులకు మెసేజ్ రూపంలో తెలిపింది. అయితే ఈ అంతరాయానికి కారణం కొన్ని అప్డేట్ చేయాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల వినియోగదారులు ఈ రోజున సహకరించాలని పేర్కొంది. ఇంతకీ బ్యాంకు పంపించిన మెసేజ్ లో ఏముందో తెలుసా?
ప్రైవేట్ బ్యాంకుల్లో నెంబర్ 2 గా ఉంటుంది హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు. ఈ బ్యాంకు నుంచి నిత్యం కోట్లాది రూపాయలు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అయితే వినియోగదారుల సౌలభ్యానికి డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు మనీ ట్రాన్స్ ఫర్ కు ఉపయోగించే యూపీఐ లావదేవీలకు అవకాశం కల్పించింది. ఈ బ్యాంకు కు సంబంధించి పే జాప్ ఉన్నప్పటికీ పేటీఎం, గుగూల్ పే మనీ ట్రాన్స్ ఫర్ యాప్స్ లో ఈ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
అయితే లేటేస్టుగా ఈ బ్యాంకు UPI లావాదేవీలు జూలై 13న మూడు గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఆరోజు ఉదయం 3 గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సిస్టమ్ అప్ గ్రేడ్ చేయనున్నారు. అయితే ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు యూపీఐ లావాదేవీలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ బ్యాంకుకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేస్తాయి. వీటి ద్వారా వినియోగదారులు ఆర్థిక వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్యాంకు ఖాతాదారులకు మెసేజ్ వస్తోంది. అయితే కొందరు ఇది రియలా? ఫేక్ నా అని అనుమానపడుతున్నారు. ఏదైనా అత్యవసరం ఉన్న వారు బ్యాంకుకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుంటే బెటర్. లేకుంటే ఇదే సమయంలో కొందరు ఫేక్ లింక్ మెసెజ్ పంపించే అవకాశం ఉంది. వాటిని పట్టించుకోకుండా బ్యాంకు అధికారులను సంప్రదించాలి.