https://oktelugu.com/

Manamey Movie: శర్వానంద్-కృతి శెట్టి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మనమే’ థియేటర్లో మిస్ అయ్యారా… ఓటీటీలో చూసేయండి!

Manamey Movie: మనమే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. మనమే మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమైనట్లు సమాచారం.

Written By:
  • Gopi
  • , Updated On : July 6, 2024 / 04:22 PM IST

    Sharwanand Manamey Movie OTT Release Date

    Follow us on

    Manamey Movie: శర్వానంద్-కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. జూన్ 7 వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మనమే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. మనమే మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమైనట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.

    మనమే చిత్ర డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మూవీ విడుద నాలుగు వారాలు కావస్తోంది. జులై 12 నుండి మనమే హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుందని టాలీవుడ్ టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మనమే చిత్ర కథ విషయానికి వస్తే… విక్రమ్(శర్వానంద్) శర్వానంద్ లండన్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతడు ప్లే బాయ్ టైప్. నచ్చిన ప్రతి అమ్మాయిని ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి బాధ్యతలు తెలియవు.

    సుభద్ర(కృతి శెట్టి) పద్ధతి గల అమ్మాయి. లండన్ లో జాబ్ చేస్తుంది. వీరిద్దరికీ అనుకోకుండా ఓ ఉమ్మడి బాధ్యత ఏర్పడుతుంది. ప్రమాదంలో భార్య భర్త చనిపోవడంతో వారి పిల్లాడి సంరక్షణ బాధ్యత విక్రమ్, సుభద్ర తీసుకుంటారు. విరుద్ధ స్వభావాలు కలిగిన సుభద్ర-విక్రమ్ పిల్లాడి కోసం ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. జులాయి విక్రమ్ కి పిల్లాడిని చూసుకోవడం కూడా భారం అవుతుంది. పిల్లాడిని చూసుకోవడం వాళ్లకు భారం అవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు గిల్లికజ్జాలు.

    అలాంటి విక్రమ్, సుభద్ర అనుకోకుండా ప్రేమలో పడతారు. పిల్లాడి కారణంగా కలిసి సుభద్ర-విక్రమ్ ల కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగతా కథ. వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక రోల్స్ చేశారు. హేష్మ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.