https://oktelugu.com/

Pushpa Deleted Scene: ‘పుష్ప’లో ఈ సీన్ పడి ఉంటేనా..?

Pushpa Deleted Scene: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 17న విడుదలైంది. ప్రస్తుతం రెండో వారంలో కొనసాగుతున్న ‘పుష్ప’  150కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతూ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది. భారీ బడ్జెట్లో తెరెకెక్కిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, మలయాళం, ఓవర్సీస్ లలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. విడుదలకు ముందే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2021 / 02:00 PM IST
    Follow us on

    Pushpa Deleted Scene: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 17న విడుదలైంది. ప్రస్తుతం రెండో వారంలో కొనసాగుతున్న ‘పుష్ప’  150కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతూ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

    Pushpa Deleted Scene

    భారీ బడ్జెట్లో తెరెకెక్కిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, మలయాళం, ఓవర్సీస్ లలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. విడుదలకు ముందే రూ.145కోట్ల బిజినెస్ చేసిన ‘పుష్ప’ బ్రేక్ ఈవెంట్ సాధించేందుకు మరికొంత సమయం పట్టేలా కన్పిస్తోంది. ఈ వీకెండ్స్ నాటికి ‘పుష్ప’ సేఫ్ గా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఈ మూవీలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ ఆర్మీలా చెలరేగిపోయాడు. మాస్ ప్రేక్షకులను అలరించేలే పక్కా మాస్ గెటప్ లో కన్పించిన పుష్పరాజ్ అదిరిపోయే యాక్షన్స్ సీన్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్లలో సుకుమార్ మార్క్ కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, సమంత స్పెషల్ సాంగ్, రష్మిక అందాలు సినిమాకు ప్లస్ గా మారాయి.

    Also Read:  ఆ డైరెక్టర్ ను బూతులు తిట్టేసిన సమంత !

    ఇక ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సీన్లను దర్శకుడు సుకుమార్ తొలగించాడు. వాటిని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నేడు ‘పుష్ప’లో తొలగించిన సన్నివేశాన్ని ‘పుష్ప డీలిట్-1’ పేరుతో సోషల్ మీడియాలో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.

    రెడ్డప్ప అనే వడ్డీ వ్యాపారి నుంచి కుటుంబ పోషణ కోసం పుష్పరాజ్ తల్లి డబ్బులు తీసుకుంటుంది. ఈక్రమంలోనే అప్పు కట్టమని రెడ్డప్ప పుష్ప ఇంటికి వస్తాడు. ‘భారతమ్మ ఎంతకాలం తప్పించుకుంటావ్ ఇట్టా.. పోయిన గంగ జాతరకు ఇస్తి.. ఇప్పటిదాకా అసలు లేదు వడ్డీ లేదు’ అంటూ నానా హైరానా చేస్తాడు. అప్పుడే నిద్రలేచిన పుష్పరాజ్ రెడ్డప్ప మాటలు చెర్రొత్తుకొచ్చినప్పటికీ సైలంట్ గా ఉండిపోతాడు.

    ఆ తర్వాత తన ఇంట్లోని బర్రెను అమ్మి రెడ్డప్ప అప్పు తీరుస్తాడు. లెక్క సరిపోయింది అన్న రెడ్డప్ప చెప్పగానే పుష్ప రాజ్ ‘నీ లెక్క సరిపోయింది సరే.. మరీ నా లెక్క.. మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెల్సింది.. మరి తిరిగి ఇచ్చేశామని అందరికి తెలియద్దా? అంటూ నిలదీస్తాడు.

    ఆరోజు రేషన్ తీసుకోవడానికి వచ్చిన వారందరి దగ్గరికి రెడ్డప్పను కొట్టుకుంటూ తీసుకెళ్లి మరీ చెప్పిస్తాడు..’ ఈ సీన్ థియేటర్లలో పడి ఉంటే అల్లు ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్లు.  థియేటర్లో విజిల్స్ మోత మోగేది. అలాంటిదీ ఈ సీన్ ను ఎందుకు కట్ చేశారా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.