ఫలించిన మోడీ వ్యూహం?

భారత్-చైనా సరిహద్దులో చెరిగిన ఘర్షణ అనంతరం గల్వాన్‌ వ్యాలీలో ప్రధాని మోడీ పర్యటనకు సత్ఫలితాలు వస్తున్నాయి. చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌ కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘భారత్‌, చైనా సరిహద్దులో చైనా దురాక్రమణ తీరు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆ దేశ దుందుడుకు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఈ చర్యలన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి’’ అని ట్రంప్‌ అన్నారు. అలాగే ఇరు […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:16 pm
Follow us on

భారత్-చైనా సరిహద్దులో చెరిగిన ఘర్షణ అనంతరం గల్వాన్‌ వ్యాలీలో ప్రధాని మోడీ పర్యటనకు సత్ఫలితాలు వస్తున్నాయి. చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌ కు బాసటగా నిలుస్తున్నాయి.

ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘భారత్‌, చైనా సరిహద్దులో చైనా దురాక్రమణ తీరు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆ దేశ దుందుడుకు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఈ చర్యలన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి’’ అని ట్రంప్‌ అన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న ఆయన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

‘‘ఘర్షణ ద్వారా ఎలాంటి సమస్యకు పరిష్కారం లభించదు. ఇరు దేశాలు చర్చల ద్వారా సామరస్యకపూర్వక వాతావరణంలో సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవాలి’’ అని చెబుతూ చైనా దురుసు వైఖరిని బ్రిటన్‌ విమర్శించింది.

మరోవైపు చైనా విస్తరణకాంక్షను అగ్రరాజ్యానికి చెందిన పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అలాగే భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు.