https://oktelugu.com/

చైతూ సరసన రష్మిక?

అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరకు పరిచమైన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఫస్ట్‌ సినిమా ‘జోష్‌’తోనే మాస్‌ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అంతగా సక్సెస్‌ కాకపోవడంతో తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలతో ముందుకెళ్తున్నాడు. ప్రేమ కథా చిత్రాల్లోనే వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో మజిలీతో సూపర్ హిట్‌ ఖాతాలో వేసుకున్న చైతూ… రీసెంట్‌గా మేనమామ వెంకటేశ్‌తో ‘వెంకీ మామ’తోనూ మెప్పించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’తో ముందుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 4, 2020 / 02:47 PM IST
    Follow us on


    అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరకు పరిచమైన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఫస్ట్‌ సినిమా ‘జోష్‌’తోనే మాస్‌ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అంతగా సక్సెస్‌ కాకపోవడంతో తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలతో ముందుకెళ్తున్నాడు. ప్రేమ కథా చిత్రాల్లోనే వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో మజిలీతో సూపర్ హిట్‌ ఖాతాలో వేసుకున్న చైతూ… రీసెంట్‌గా మేనమామ వెంకటేశ్‌తో ‘వెంకీ మామ’తోనూ మెప్పించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’తో ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. కరోనా ప్రభావం ముగిశాక థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. దీని తర్వాత పరశురాం దర్శకత్వంలో ఈ మూవీని అనౌన్స్‌ చేసిన తర్వాత ఆపై ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడు.

    సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

    ఈ మూవీకి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం రోజూ వార్తల్లో ఉంటోంది. నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా? అని చిత్ర బృందం ఇంకా అన్వేషిస్తూనే ఉందట. ముందు చైతూ భార్య సమంతనే హీరోయిన్‌గా ఎంచుకున్నట్టు ప్రచారం జరిగింది. అంతలోనే ‘మహానటి’ కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సామ్, కీర్తి ఇద్దరూ కాదంటూ మరో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు కుర్ర హీరోలు, స్టార్ల సరసన వరుస అవకాశాలు పట్టేస్తున్న రష్మిక మందాన. దక్షిణాదిలో బిజీ హీరోయిన్‌గా మారిన రష్మికకు విక్రమ్‌ స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నాడని టాక్‌. వాస్తవానికి ‘థ్యాంక్యూ’ కోసం సమంత పేరును పరిశీలించనేలేదని, ఈ స్టోరీలో ఫీమేల్‌ లీడ్ రోల్‌కు కీర్తి సురేశ్‌ సూటవదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో, ఈ మధ్య ఫుల్ ఫాలోయింగ్‌ దక్కించుకున్న రష్మిక డేట్స్‌ సంపాదించాలని చిత్ర బృందం భావిస్తోందట. ఆమె ఓకే అంటే వెంటనే అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తోందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.