Balakrishna: సినిమా సెట్స్ లో ప్రమాదాలు సర్వసాధారణం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న బచ్చన్ పాండే సినిమా షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో.. షూట్ కి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. అక్షయ్ కుమార్, కృతి సనన్‌లపై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి.

మంటలు చెలరేగిన వెంటనే అలర్ట్ అయిన చిత్ర యూనిట్ మంటలను ఆర్పివేసి.. హీరోహీరయిన్లను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.అక్షయ్ కుమార్ కూడా తన సినిమా సెట్‌లో ఇలా అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశాడు.
Also Read: రాజ్యసభ రేసులో సుబ్బారెడ్డి.. అందుకేనా అలాంటి కామెంట్స్..?
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి ఇంట్లో సంక్రాంతి సందడి చేశాడు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లిన ఆయన గత రెండు రోజులుగా అక్కడే సరదాగా గడుపుతున్నారు. బంధువులతో కలిసి చీరాల వాడరేవు బీచ్‌కు వెళ్లి.. ఫ్యామిలీతో ఆనందంగా గడిపారు. బాలయ్య తన సతీమణి వసుంధరను జీప్‌లో ఎక్కించుకుని జాలీగా బీచ్‌లో రైడ్ చేయడం అక్కడ అందర్నీ ఆకట్టుకుందట. మొత్తమ్మీద ఓపెన్ టాప్ జీపులో బాలయ్య చాలా ఓపెన్ గా సందడి చేశాడు.
ఇక సోషల్ మీడియోలో మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక వీడియో కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ మంచు లక్ష్మి ఏ వీడియో షేర్ చేసింది అంటూ ఫ్యాన్స్ కూడా రెట్టింపు ఆసక్తితో సెర్చ్ చేస్తున్నారు. మంచు లక్ష్మి తాజాగా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. ఆమె సోదరుడు మంచు విష్ణు ఆమెను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ దాన్ని మంచు లక్ష్మి పోస్ట్ చేసింది. విష్ణుకి మోహన్‌బాబు సైతం సాయం చేశాడు. తండ్రి తనకు సాయం చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేసినందుకు కోపంతో లక్ష్మి పెద్దగా అరిచింది కూడా.