https://oktelugu.com/

Subarnarekha Gold River : ఈ నదుల్లో బంగారం పారుతోంది.. ఉచితంగా తెచ్చుకోవచ్చు.. ఎక్కడో తెలుసా?

డిమాండ్ ఉన్న బంగారాన్ని ఎవరైనా ఉచితంగా ఇవ్వమంటే ఇస్తారా? అదే నదీ వెంట బంగారం ఉంటుందంటే ఎవరైనా ఊరుకుంటారా? వెంటనేవెళ్లి తోడుకుంటారు. కానీ అమెరికాతో పాటు భారత్ లోని కొన్ని నదుల్లో బంగారం నదుల వెంట పారుతూ ఉంటుంది. ఆ నదులు ఏవంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 24, 2024 5:26 pm
    Subarnarekha Gold River

    Subarnarekha Gold River

    Follow us on

    Subarnarekha Gold River :  భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. పిసిరంత బంగారం దొరికితే జాగ్రత్తగా ఉంచుకుంటారు. ప్రతీ ఏడాది అక్షయ తృతీయ రోజున ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. బంగారాన్ని లక్ష్మీదేవతతో పోలుస్తారు. ఈ తరుణంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక గజం భూమితో ఒక తులం బంగారం సమానంగా అయ్యు రోజులు రాబోయే అవకాశం ఉంది. ఇంత డిమాండ్ ఉన్న బంగారాన్ని ఎవరైనా ఉచితంగా ఇవ్వమంటే ఇస్తారా? అదే నదీ వెంట బంగారం ఉంటుందంటే ఎవరైనా ఊరుకుంటారా? వెంటనేవెళ్లి తోడుకుంటారు. కానీ అమెరికాతో పాటు భారత్ లోని కొన్ని నదుల్లో బంగారం నదుల వెంట పారుతూ ఉంటుంది. ఆ నదులు ఏవంటే?

    నదుల వెంట నీళ్లు రావడం చూస్తుంటాం.. ఈ నీళ్ల కింద మట్టి ఉంటుందని తెలుసు. కానీ నదుల్లో నీళ్లతో పాటు బంగారం కూడా వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం ఎందుకంటే కొన్ని నదుల్లో నీటితో పాటు బంగారం ప్రవహిస్తుంటుంది. అలాంటి వాటిలో మిస్సౌరి నది ఒకటి. ఇది అమెరికాలో ఉంది. ఈ నదిలో బంగారం ఉందన్న విషయం 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇక్కడి ప్రజలు ఇసుకను ఫిల్టర్ చేసి బంగారు రేణువులు సేకరించుకుంటారు. కానీ ఒక రోజంతా కష్టపడితే ఒక గ్రాము బంగారం మాత్రమే వచ్చింది.

    అమెరికాలోని మరో నది బిగ్ హాల్. ఇక్కడ కూడా నదిలో బంగారం లభిస్తుంది. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో లభిస్తుందని గుర్తించారు. ఇక్కడ కొన్నేళ్ల కిందట 5 మిలియన్ల డాలర్ల విలువైన బంగారాన్ని బయటకు తీసినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే కాలిఫోర్నియాలోని యూబానదికి ఉప నదుల్లో బంగారం రేణువులు గుర్తించారు. 1850లోనే ఇక్కడ బంగారు మైనింగ్ లు కనుగొన్నారు. ఇప్పటికీ ఇక్కడ బంగారం కోసం సెర్చ్ చేస్తుంటారు.

    ఇండియాలోనూ కొన్ని నదుల్లో బంగారు నదులు ఉన్నాయి. వీటిలో సుబర్ణ రేఖ నది ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలోని ఉన్న ఈ నది ఇసుకను ఫిల్టర్ చేయడం వల్ల బంగారం దొరికే అవకాశాలు ఉన్నాయని తుేలింది. ఇక్కడ స్థానిక గిరిజనులు ఎక్కువ శాతం ఇలా ఇసుకను ఫిల్టర్ చేసి బంగారాన్ని వెలికి తీస్తుంటారు. ఈ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలగుండా ప్రవహిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బంగారం కోసం ప్రత్యేకంగా తవ్వకాలు జరిపి సేకరిస్తారు. భారత్ లోని స్వర్ణ రేఖ నదితో పాటు దాని ఉపనదిలోనూ బంగారం రేణువులు కనుగొన్నారు.

    అయితే నదుల్లో బంగారం ఎలా ఉంటుంది? అని కొందరికి సందేహం ఉంటుంది. బంగారం గనుల్లో నదినీరు ప్రవహించడం వల్ల ఆ నీటితో పాటు ఈ బంగారు రేణువుల కొట్టుకు వస్తుంటాయి. ఇలా వస్తుండగా కొందరు గుర్తించి దానిని దక్కించుకుంటారు. ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. అందుకే కాస్త బంగారం దొరికినా తమకు మంచి లాభం ఉంటుందిన అశిస్తారు.